దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు పదవీ గండం తప్పింది. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌ను పీపుల్ పవర్ పార్టీ బహిష్కరించింది. దీంతో ఆయనకు పదవీ గండం తప్పింది. యూన్ సుక్ యోల్‌పై విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెండువంతుల మెజారిటీ ఉండాలి. కానీ అధికార ‘పీపుల్ పవర్’ పార్టీకి చెందిన చాలామంది చట్టసభ్యులు ఓటింగ్‌ను బహిష్కరించడంతో ఆయన అభిశంసన నుంచి బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Kishan Reddy: ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీదే గెలుపు..
పార్లమెంట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, శత్రు దేశం ఉత్తర కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయంటూ యూన్ సుక్ యోల్ మంగళవారం రాత్రి దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించారు. అయితే మార్షల్ లా విధించడాన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. రాత్రికి రాత్రే పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్‌కు డిమాండ్ చేశారు. అయితే అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే నేషనల్ అసెంబ్లీలో 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. ప్రతిపక్ష పార్టీలకు 192 సీట్లు ఉండగా, అధికార పార్టీకి చెందిన ముగ్గురు చట్టసభ్యులు మాత్రమే ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్ల సంఖ్య 200కి చేరుకోనందున బ్యాలెట్ లెక్కింపు లేకుండానే తీర్మానం రద్దైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లిపోతుందన్న కారణంతో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని అధికార పార్టీ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Khans: ఆడియన్స్ కి దూరంగా త్రీఖాన్స్.. ఎందుకబ్బా?