Site icon NTV Telugu

South Koria: ఎవడ్రా నువ్వు.. మరీ ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. కేసు ఓడిపోతే.. అలా చేస్తారా..

Sam (3)

Sam (3)

సాధారణంగా ఎవరికైనా ప్రస్టేషన్ ఎక్కువైతే ఏం చేస్తాం.. ఎక్కడైనా పీస్ ఫుల్ ఏరియాలో కొంచెం సేపు కూర్చుంటాం.. ఇంకా ప్రస్టేషన్ ఎక్కువైతే.. ఏదైనా కామెడీ వీడియోలు.. లేకపోతే.. ఫన్నీ చాట్ చేస్తుంటాం.. ఇష్టమైన వారితో మాట్లాడుకుంటాం.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. భార్యతో విడాకుల కేసులో ఓడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి ఏకంగా మెట్రో రైలుకే నిప్పు పెట్టాడు..

పూర్తి వివరాల్లోకి వెళితే.. సౌత్ కొరియాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విడాకుల కేసులో ఓడిపోయిన భర్త నిరాశ, ఆగ్రహంతో మెట్రో రైలుకు నిప్పంటించాడు. ఈ ఘటన మే 31న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

67ఏళ్ల వోన్ అనే వ్యక్తి భార్యతో విడాకుల కేసులో ఓడిపోయాడు. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి రావడంతో విసిగిపోయాడు. ఆగ్రహంతో సియోల్ సబ్ వే లైన్ 5లో నడుస్తున్న మెట్రో రైలు నేలపై పెట్రోల్ పోశాడు. ఆ తర్వాత తనకు తాను నిప్పంటించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయంతో పరుగులు పెట్టారు జనాలు. దాదాపు 160మందికిపైగా ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకోగా.. 22 మంది మంటల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరారు. ప్రాణ నష్టం తప్పినా ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version