NTV Telugu Site icon

South Africa Gold Mine: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మైనర్లు మృతి..

South Africa

South Africa

South Africa Gold Mine: దక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని సుమారు 100 మంది అక్రమ మైనర్ కార్మికులు మృతి చెందినట్లు తెలుస్తుంది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం.. ఈ కార్మికులందరూ సౌతాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు నిర్వహిస్తున్నారు. ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వారు చనిపోయారని వెల్లడించారు. కాగా, గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

Read Also: Naval Ships: రేపు నేవీలోకి మరో మూడు యుద్ధనౌకలు.. జాతికి అంకితం చేయన్నున్న ప్రధాని

అయితే, మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని ప్రెస్ తో మాట్లాడుతూ.. కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చాం.. వారి దగ్గర రెండు వీడియోలు దొరికాయి.. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలోని గనిలో కనిపిస్తున్నాయని చెప్పారు. వాయువ్య ప్రావిన్స్‌లోని ఈ గనిలో దాదాపు 100 మంది వరకూ మృతి చెందారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. వారు ఆకలి, డీహైడ్రేషన్‌ కారణంగా చనిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

Show comments