Site icon NTV Telugu

Solar Storm Hits Earth: సౌర తుఫాన్ భూమిని తాకితే ఎలా ఉంటుందో తెలుసా..? స్టన్నింగ్ వీడియో షేర్ చేసిన ఐఎస్ఎస్

Aurora Lights From Space

Aurora Lights From Space

Astronauts Capture Shimmering Aurora Lights From Space: ఇటీవల కాలంలో సూర్యుడి వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. సూర్యుడు మధ్య వయస్సుకు చేరుకోవడంతో సూర్యుడిపై భారీగా బ్లాక్ స్పాట్స్, సౌర జ్వాలలు, సౌరతుఫానులు సంభవిస్తున్నాయి. ఇందులో కొన్ని నేరుగా భూమి వైపు వస్తున్నాయి. అత్యంత ఆవేశపూరిత కణాలతో కూడిన సౌర తుఫానులు భూమిని తాకుతుంటాయి. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం సౌరతుఫానులు భూమిపై పెద్దగా ప్రభావం చూపించలేవు. భూమికి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ తుఫానుల నుంచి జీవజాలన్ని రక్షిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో భూ వాతావరణానికి ఎగువన ఉండే శాటిలైట్లు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వంటివి ప్రభావితం అవుతుంటాయి.

Read Also: Suriya: సూర్య@25.. ఆకాశం నీ హద్దురా

అయితే సౌర తుఫాన్ భూ వాతావరణాన్ని తాకితే ఎలా ఉంటుందో చిత్రీకరించింది ఐఎస్ఎస్. ముఖ్యంగా ధృవాల వద్ద అరోరాలు ఏర్పడుతాయి. సౌరతుఫాను భూ వాతావరణాన్ని ఢీకొన్నప్పుడు ధృవాల వద్ద అద్భుతమై కాంతి ఏర్పడుతుంది. మెరిసే కాంతి రూపంలో అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యం. తాజాతా ఓ మోస్తారు సౌర తుఫాన్ భూమిని ఢీకొన్న సమయంలో ఏర్పడిన ఆరోరాను ఐఎస్ఎస్ వీడియో తీసింది. ఈ వీడియోను ఆదివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. హిందూ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పు వైపున ప్రయాణిస్తున్నప్పడు ఐఎస్ఎస్ ఈ అద్భుత దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. అరోరాలను ఉత్తర, దక్షిణ లైట్లు అని కూడా పిలుస్తారు. సూర్యుడి నుంచి వచ్చే ఆవేశపూరిత కణాలు, భూ వాతావరణాన్ని ఢికొన్నప్పుడు ఈ కాంతి ఏర్పడుతుంది. అరోరాలు భూమి వాతావరణానికి పైన ఏర్పడుతుంటాయి. దాదాపుగా ఐఎస్ఎస్ కక్ష్య ఉన్నంత ఎత్తులో ఇవి ఏర్పడుతాయి.

ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఏకంగా 1,13,000 మంది వీక్షించగా.. 3000 లైకులు పొందింది. ఈ అద్భుత దృశ్యంపై నెటిజెన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ దృశ్యం అద్భుతంగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా భూమిని ఢీ కొన్న సౌర తుఫాన్ జీ2 తరగతికి చెందినది.. జీ2ను తక్కువ స్థాయి తుఫానుగా వర్గీకరించారు. ఈ తుఫాన్ భూవాతరణాన్ని ఢీకొనడం వల్ల తాజా ఆరోరాలు ఏర్పడ్డాయి.

Exit mobile version