NTV Telugu Site icon

Slovakia: స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..

Slovakia Pm

Slovakia Pm

Slovakia: స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడ్డాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో దేశ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజధానికి ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

Read Also: Pakistan: పాకిస్తాన్‌కి మోడీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ వ్యాపారవేత్త ప్రశంసలు..

దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ముట్టడించారు. కీలకమైన యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు మూడు వారాల ముందు స్లోవేకియాలో కాల్పులు జరిగాయి. ప్రధాని ఫికోపై జరిగిన దాడిని ఆ దేశ ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ దాడిని ప్రెసిడెంగ్ జునానా కాపుటోవా క్రూరమైనదిగా వర్ణించారు. క్లిష్టసమయంలో రాబర్ట్ ఫికోకు అండగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఫికో కరడుగట్టిన రైట్ వింగ్ నాయకుడిగా పేరుంది. పాశ్చాత్య దేశాలను కాదని, ఇతను హాలాండ్ మార్గాన్ని అనుసరిస్తున్నారనే పేరుంది. ఫికో విధానాలను నిరసిస్తూ వేలాది మంది రాజధానిలో మరియు స్లోవేకియా అంతటా ఇటీవల ర్యాలీలు నిర్వహించారు. ఫికోపై దాడిని యూరప్ లోని ఇతర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

Show comments