PM Modi: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల సర్వసభ్య సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటున్న విషయం తెలిసిందే. బ్రెజిల్, రష్యా, ఇండియా, సౌత్‌ఆఫ్రికా(బ్రిక్స్) దేశాలతో బ్రిక్స్ గ్రూప్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 4 దేశాలతో కొనసాగుతున్న బ్రిక్స్ కాస్త భవిష్యత్‌లో మరో 6 దేశాలు చేరనున్నాయి. దేశాల మధ్య ఆర్థిక సంబంధాలతోపాటు, వాణిజ్య సంబంధాలను కొనసాగించడం ఇందులో ప్రధాన ఉద్దేశం. బ్రిక్స్ సమావేశాల సందర్బంగా 2024 నుంచి బ్రిక్స్‌లో మరో ఆరు దేశాలు చేరనున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ బ్రిక్స్ విస్తరణకు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల గ్రూపింగ్ విస్తరణను భారత్ స్వాగతిస్తున్నదని మోడీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా బ్రిక్స్ లో మరో ఆరు కొత్త సభ్య దేశాల చేరుతున్నట్టు ప్రకటించారు. సిరిల్ రమాఫోసో కొత్త దేశాల చేరిక గురించి ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ ధృవీకరణను స్పష్టం చేశారు.
Read Also: TRT Notification : తెలంగాణాలో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి..
దక్షిణాఫ్రికాలో జరిగిన 3 రోజుల సమావేశంలో, చాలా సానుకూల ఫలితాలు వెలువడినందుకు నేను సంతోషిస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. బ్రిక్స్ సభ్యుల విస్తరణకు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తోందని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కొత్త సభ్య దేశాలను బ్రిక్స్ గ్రూప్‌లో భాగస్వాములుగా అంగీకరించడానికి భారతదేశం ఆసక్తిగా ఉందన్నారు. బ్రిక్స్ గ్రూప్ పూర్తి సభ్యత్వం కోసం ఆరు దేశాలను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కొత్తగా బ్రిక్స్ లో చేరే దేశాలు అర్జెంటీనా, ఇథియోపియా, ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. అయితే ఇప్పటికే బ్రిక్స్ లో బ్రెజిల్, రష్యా, చైనా, భారతదేశం మరియు దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.