Shocking Twist In Greece Train Crash: మంగళవారం అర్థరాత్రి సమయంలో గ్రీస్‌లో రెండు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే! థెస్సాలీ నుంచి లారిస్సాకు వెళ్తున్న ఒక ప్యాసింజర్ రైలు.. తెంపీ సమీపంలో ఒక కార్గో రైలుని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 57 మంది మరణించగా.. వారిలో 36 మంది సజీవదహనం అయ్యారు. మరో 85 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై అక్కడ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతుండగా.. తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. అధికారులు రిలీజ్ చేసిన ఓ ఆడియో రికార్డింగ్‌లో.. రెడ్ లైట్‌ని బేఖాతరు చేయాల్సిందిగా డ్రైవర్‌కు ట్రైన్ మాస్టర్ చెప్పినట్టు స్పష్టంగా వినిపిస్తోంది. ‘‘రెడ్ లైట్‌ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నియాన్ పొరాన్ ఎంట్రీ లైట్ వచ్చేదాకా ప్రయాణం కొనసాగించు’’ అంటూ ట్రైన్ మాస్టర్ ఆ ఆడియోలో పేర్కొన్నాడు. అప్పటికీ డ్రైవర్‌కి అనుమానం వచ్చి.. ‘నిజంగానే వెళ్లాలా?’ అని మరోసారి అడిగాడు. అందుకు ఆ మాస్టర్ స్పందిస్తూ.. ‘పర్లేదు వెళ్లు’ అంటూ బదులిచ్చాడు. ఇలా రెడ్ లైట్‌ని పట్టించుకోకుండా, నిర్లక్ష్యం వహించడం వల్లే.. ఇంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ట్రైన్ మాస్టర్‌ని అరెస్ట్ చేసినప్పుడు.. ఇదంతా సాంకేతిక లోపం వల్లే జరిగిందని, తనకేం తెలియని బుకాయించాడు. అనంతరం తన తప్పుని అంగీకరించాడు.
Security Guard Robbery: అన్నం పెట్టిన ఇంటికే.. కన్నం పెట్టిన సెక్యూరిటీ గార్డ్
మరోవైపు.. ఈ ఘటనపై గ్రీకు రైలు కంపెనీ హెలెనిక్ రైలు సెట్రల్ ఏథెన్స్ ప్రధాన కార్యాలయం వద్ద విద్యార్థి, కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టారు. బుధవారం ఈ నిరసన హింసాత్మకంగా సాగడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో గురువారం నిరసన శాంతియుతంగా కొనసాగింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ నిరసనకారులు ఆందోళన చేశారు. ఈ తప్పిదానికి కేవలం ఒక్కరిని మాత్రమే నిందించలేమని.. ఇప్పుడు నేతలు, అధికారులందరూ ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు మనుషుల ప్రాణాల కన్నా, ఎన్నికలే ముఖ్యమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రమాదం చాలా తీవ్రమైంది కాబట్టి.. మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు.. రైల్వే ఉద్యోగుల సంఘాలు సమ్మె నిర్వహిస్తున్నారు. జాతీయంగా రైలు సేవలు నిలిపివేసి.. పని పరిస్థితులను నిరసిస్తూ, రైలు వ్యవస్థను ఆధునీకరించడం ప్రమాదకరమైన వైఫల్యంగా అభివర్ణించారు. శుక్రవారం కూడా రెండోసారి సమ్మెకు పిలుపునిచ్చారు. సెంట్రల్ ఏథెన్స్‌లో వామపక్ష సమూహాలచే రెండు వేర్వేరు నిరసనలూ జరిగాయి.
Manchu Lakshmi: ఈ ఒక్క విషయంలో మాత్రం నువ్వు దేవతవక్కా..