కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది.. కఠిన నిబంధనలు పాటిస్తోంది.. అయితే, కరోనా నిబంధనల పేరుతో అధికారులు ప్రదర్శించి అత్యుత్సాహం విమర్శలకు దారితీసింది. షాంఘై సిటీలో కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తోన్న విషయం తెలిసిందే కాగా.. ప్రజలు క్వారెంటైన్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితులు దాపురించాయి.. ఇదే సమయంలో, కోవిడ్ నెగిటివ్‌గా ఫలితం వచ్చినవాళ్లను కూడా సిటీకి దూరంగా ఏర్పాటుచేసిన పాక్షిక నివాస కేంద్రాలకు తరలిస్తున్నారని సమాచారం. షాంఘై సిటీలో 2.5 కోట్ల జనాభా ఉండగా.. కోవిడ్ పాజిటివ్‌గా తేలితే.. క్వారెంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు అధికారులు.. నెగిటివ్ రిపోర్ట్ వచ్చినవారికి కూడా ఆ క్వారంటైన్ సెంటర్లకే తరలిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయట. అయితే, అధికారుల మాత్రం.. వైరస్ సోకకుండా ఉండేందుకే క్వారెంటైన్‌కు తరలిస్తున్నట్టు చెబుతున్నారు.
Read Also: Live: ‘సర్కారువారి పాట’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..