S*x Warfare: టెక్ కంపెనీల రహస్యాలను, ట్రేడ్ సీక్రెట్లకు సంబంధించిన రహస్యాలను సేకరించడానికి కొత్త తరహా ‘‘గూఢచర్యం’’ జరుగుతోంది. ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీకి సంబంధించిన పలు కంపెనీల వివరాలను సేకరించడానికి చైనీస్, రష్యన్లు ‘‘సె*క్స్ వార్‌ఫేర్’’ను ప్రారంభించారు. అందమైన, ఆకట్టుకునే మహిళల్ని వాడుకుని, ఉద్యోగుల నుంచి వివరాలను రాబడుతున్నారు. వారితో సంబంధాలు కొనసాగించడంతో పాటు, కొన్ని సార్లు వారిని వివాహం చేసుకుని, పిల్లల్నికని జీవితాంతం వారి నుంచి కంపెనీ సీక్రెట్లను తెలుసుకుంటున్నారు. నిఘా నిపుణులు ఈ తరహా గూఢచర్యాన్ని ‘‘సె*క్స్ వార్‌ఫేర్’’గా పిలుస్తున్నారు. అమెరికా సాంకేతిక ఆధిపత్యాన్ని ఈ తరహా గూఢచర్యం సవాల్ చేస్తోంది.
Read Also: OnlyFans: జాబ్ అంటే ఇది కదా.. ఓన్లీఫ్యాన్స్ ప్రతి ఉద్యోగికి రూ. 330 కోట్ల ఆదాయం..
చైనాలో పెట్టుబడులు పెట్టే యూఎస్ కంపెనీలకు సలహాలు ఇచ్చే పామిర్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ ముల్వెనాన్ ఈ తరహా చర్యల్ని స్వయంగా చూసినట్లు చెప్పారు. ‘‘ నాకు ఆకర్షణీయమైన యువతి నుంచి లింక్డ్ ఇన్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయి’’ అని చెప్పారు. వర్జీనియాలో ఇటీవల జరిగిన బిజినెస్ మీటింగ్‌లో ఇద్దరు అందమైన చైనీస్ యువతులు ప్రయత్నించారని ముల్వెనాన్ చెప్పారు.
సెక్స్ ఆధారిత గూఢచర్యం ముప్పులో ఒక భాగం మాత్రమే, చైనా యూఎస్ వ్యాపార ప్రణాళికల్ని సేకరించడానికి అమెరికాలో స్టార్టప్ గేమ్స్ నిర్వహిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఒక ప్రాజెక్టు వివరాలను తెలుసుకునేందుకు అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్‌ను రష్యన్ మహిళ వివాహం చేసుకున్న కేసును అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారి వివరించారు. మేధో సంపత్తి దొంగతనం సంవత్సరానికి $600 బిలియన్ల వరకు ఖర్చవుతుందని, ఇది ఎక్కువగా చైనా నునంచి జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్స్ చైనీస్ పెట్టుబడిదారులతో తమ ప్రణాళికల్ని షేర్ చేసుకుంటే, రహస్యాలను కోల్పోయే అవకాశం ఉండటంతో పాటు చైనాకు వెళ్లాల్సి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కొరియా, ఇజ్రాయిల్ వంటి మిత్రదేశాలు కూడా నిశ్శబ్ధంగా నిఘాను సేకరిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
