NTV Telugu Site icon

Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి

Usa

Usa

Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో కాల్పులు ఘటన జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ దుండగుడు ప్రజలపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

Read Also: Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో 3000 పేజీల ఛార్జిషీట్

మాంటేరీ పార్కాలో జరిగిన చైనీస్ ల్యూనార్ న్యూ ఇయర్ వేడక జరుగుతన్న సమయంలో శనివారం రాత్రి 10.30 తర్వాత కాల్పులు జరిగినట్లు తెలిసింది. అయితే ఘటనకు సంబంధించి మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది. 10 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతకుముందు రోజు వేలాది మంది ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. మాంటెరీ పార్క్ లాస్ ఏంజిల్స్ కౌంటీలోని ఒక నగరం, లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Show comments