NTV Telugu Site icon

Ethiopia Floods: ఇథియోపియాలో ఘోర విషాదం.. 257కి చేరిన మృతుల సంఖ్య

Ethiopiafloods

Ethiopiafloods

ఇథియోపియాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. మట్టిచరియలు విరిగి పడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 257 మంది మృత్యువాత పడ్డారని తాజాగా అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య 500 వరకు చేరవచ్చని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మృతదేహాల వెలికితీత కోసం అన్వేషణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఘటనాస్థలికి దగ్గర బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి కోసం రోధిస్తున్నారు. మరోవైపు కిన్‌ చో షాచా గోజ్‌డీ ప్రాంతం నుంచి దాదాపు 15 వేల మందికి పైగా బాధితులను ఖాళీ చేయించారు.

ఇది కూడా చదవండి: HMD Crest: తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లతో ఫోన్స్‭ను విడుదల చేసిన ఎచ్ఎండి..

ఇదిలా ఉంటే ఇథియోపియా ప్రధాని అబీఅహ్మద్‌ శుక్రవారం ప్రమాద ప్రదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఈ ఘటనపై తాను చాలా బాధపడినట్లు పేర్కొన్నారు. మట్టిచరియల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. మృతుల్లో చిన్నారులు, గర్భిణులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వర్షాలు జూలైలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు కొనసాగనున్నాయి.

ఇది కూడా చదవండి: Blue Light: మీ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మీ చర్మానికి హాని కలిగిస్తుంది..