Site icon NTV Telugu

Shaolin Temple: సె*క్స్, డబ్బు, విలాసాలు.. చైనా షావోలిన్ టెంపుల్ కుంభకోణం..

Shaolin Temple

Shaolin Temple

Shaolin Temple: చైనాలో ప్రముఖ బౌద్ధాలయం ‘‘షావోలిన్ టెంపుల్’’ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. షావోలిన్ మఠాధిపతి షి యోంగ్క్సిన్ ఆశ్రమాన్ని వ్యాపార సామ్రాజ్యంగా మార్చారనే ఆరోపణలపై చైనీస్ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. వ్యక్తిగత సంపద కోసం ఆలయ నిధులను దుర్వినియోగం చేసినట్లు అనుమానిస్తూ, చైనా కఠిన చర్యలు ప్రారంభించింది. మత సంస్థల్ని నియంత్రించడానికి, దేశంలో పెరుగుతున్న ‘‘దేవాలయ ఆర్థిక వ్యవస్థ’’ను పారదర్శకంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది.

చైనాలో ఆలయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది 100 బిలియన్ యువాన్లను చేరుకుంటుందని ది గార్డియన్ తెలిపింది. చైనాలోని బౌద్ధ ఆలయాలు, మఠాలు అనేక తీవ్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాయి. 1950లలో అనేక మఠాలు తమ ఆస్తులనను కోల్పోయాయి. 1960-70లలో అనేక ఆలయాలు దెబ్బతిన్నాయి. 1980 నుంచి ఆర్థిక సంస్కరణలతో తిరిగి ప్రజాధరణ పొందాయి. ఈ ఆలయాలు తమ ఆర్థిక సంపాదన కోసం ప్రభుత్వం మద్దతు ఉన్న పర్యాటకంపై ఆధారపడ్డాయి.

Read Also: Value Zone: అమీర్‌పేట్‌లో ఆఫర్ల వర్షం.. వాల్యూ జోన్‌లో షాపింగ్ హంగామా

ఇదిలా ఉంటే, 1500 ఏళ్ల పురాతన షావోలిన్ టెంపుల్‌ను మఠాధిపతి షి యోంగ్క్సిన్ వందల మిలియన్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా మార్చినట్లు తేలడంతో చర్యలు మొదలయ్యాయి. ఇతను అనేక మంది మహిళతో శృంగారంలో పాల్గొన్నాడని, అక్రమ సంతానాన్ని కలిగి ఉన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. రెండు వారాల్లో ఇతడిని పదవి నుంచి తొలగించి, అతడి సన్యాసిత్వాన్ని తొలగించారు.

2015లో షావోలిన్ టెంపుల్ గోల్ఫ్ కోర్స్, హోటల్, కుంగ్‌ఫూ పాఠశాలనున కలిగి ఉండే దాదాపు 300 మిలియన్ డాలర్ల ఆలయ సముదాయాన్ని నిర్మించాలనే ఆలోచన తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. అదే ఏడాది అవినీతి, మహిళలతో అక్రమ సంబంధాల ఆరోపణలు ఆయనపై వచ్చాయి. వీటిని యోంగ్క్సిన్ ఖండించారు. వ్యక్తిగత లాభం కోసం ఆలయ సంపదనను ఉపయోగించినట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఆగస్టులో హాంగ్జౌ లోని లింగ్యిన్ ఆలయంలో సన్యాసులపై కూడా ఆరోపణలు వచ్చాయి. పెద్ద మొత్తంలో డబ్బు లెక్కిస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.

Exit mobile version