NTV Telugu Site icon

Turkey Earthquake: టర్కీ భూకంప విధ్వంసం.. 300 కిలోమీటర్ల పొడవు పగుళ్లు.. శాటిలైట్ చిత్రాల్లో గుర్తింపు..

Earthquake 1

Earthquake 1

Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం ఈ రెండు దేశాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇప్పటికే రెండు దేశాల్లో కలిపి 25,000 మంది మరణించారు. శిథిలాలు తొలిగే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. 1000 కన్నా ఎక్కవసార్లు భూమి కంపించింది. ఈ ప్రభావం వల్ల టర్కీ దక్షిణ ప్రాంతం, సిరియా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే భూకంపం తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా 300 కిలోమీటర్ల పొడవుతో భూమి పగుళ్లకు దారి తీసింది. శాటిలైట్ చిత్రాల్లో ఈ పగుళ్లను స్పష్టంగా కనిపిస్తున్నాయి. యూరోపియన్ ఎర్త్-అబ్జర్వింగ్ శాటిలైట్ సెంటినెల్ -1 భూకంపానికి ముందు, తర్వాత తీసిన ఫోటోలను పోల్చి ఈ విషయాన్ని కనుగొంది. రెండు చీలికలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్యదరా సముద్రం ఈశాన్య కొన నుంచి 300 కిలోమీటర్ల పొడవుతో ఈ పగుళ్లు విస్తరించి ఉన్నాయి. ఈ పగుళ్లు రెండు భూకంపాల శక్తికి నిదర్శనం.

Read Also: Mars: అంగారకుడిపై నీటి ఆనవాళ్లు.. క్యూరియాసిటీ రోవర్ అద్భుత ఆవిష్కరణ..

టర్కీ ప్రాంతం అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ పై ఉంది. అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతంలో టర్కీ ఉంది. భూమిపై ఉన్న భూభాగం మొత్తం 15 టెక్టానిక్ పలకలుగా విభజించబడింది. ఈ పలకలు తరుచుగా ఒకదాన్ని ఒకటి ఢీకొడుతూ ఉంటాయి. అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్, అరేబియా, యూరేషియా, ఆఫ్రికా టెక్టానిక్ ప్లేట్ల మధ్య ఉంది. అరేబియన్ టెక్టానిక్ ప్లేట్, అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ ఢీకొట్టడం వల్ల ఈ భూకంపం వచ్చింది. ఇలా భూమి అంతర్భాగంలో ఏర్పడే సర్దుబాటుల ఫలితంగా భారీ భూకంపాలు ఏర్పడుతాాయి.

ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాన్ని సెంటినెల్-1 శాటిలైట్ భూమికి 700 కిలోమీటర్ల ఎత్తులో టర్కీ మీదుగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ఫోటోలు తీసింది. శాటిలైట్ పగలు లేదా రాత్రి ఏ సమయంలోనైనా భూమిని గుర్తించగలదు మరియు భూకంపాలకు గురయ్యే గ్రహం యొక్క ప్రాంతాన్ని తరచుగా స్కాన్ చేస్తుంది. భూ ఉపరితలంలో వచ్చే మార్పులను విశ్లేషిస్తుంది.

Show comments