కరోనా నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. నేను దేశాధ్యక్షుడిని నాకు ఈ రూల్స్ వర్తించవు అంటే కుదరదు. అధ్యక్షులైనా సరే నిబంధనలు పాటించకుంటే ఇదిగో ఇలా జరిమానా కట్టాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి నుంచి బ్రెజిల్ ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రజారోగ్యంపై దృష్టిసారించినప్పటికీ కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో అభివృద్ధి ఆగిపోతుందనే పేరుతో పెద్దగా పట్టించుకోలేదు. ఒక్కసారిగా కరోనా విలయతాండవం చేయడంతో హడావుడిగా లాక్‌డౌన్ వంటివి చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ఆ దేశం ఇంకా మహమ్మారితో ఇబ్బందులు పడుతూనే ఉన్నది. ఇక వచ్చే ఏడాది బ్రెజిల్‌లో ఇన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బోల్సోనారో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సావోపోలో లో బైక్ ర్యాలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓపెన్ హెల్మెట్‌తో మాస్క్ పెట్టుకోకుండా బోల్సోనారో ర్యాలీలో పాల్గోన్నారు. దీనిపై సావోపాలో గవర్నర్ జవావో డోరియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలకు అందరూ సమానమే అని, అధ్యక్షుడు బోల్సోనారోకు వంద డాలర్ల జరిమానా విధించారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఆ దేశ అధ్యక్షుడికి భారీ జరిమానా…!!
Show comments