Site icon NTV Telugu

Sanae Takaichi: జపాన్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ప్రధానిగా తొలిసారి మహిళ ఎన్నిక

Sanaetakaichi

Sanaetakaichi

జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. అమెరికా వాణిజ్యం, భద్రతా ఉద్రిక్తతల మధ్య జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి (64) ఎన్నికయ్యారు. శనివారం జరిగిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచి విజయం సాధించారు. అధికార పార్టీ నాయకత్వ రేసులో సనే తకైచి విజయం సాధించారు. ఈ పోటీలో పురుష ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించారు. 44 ఏళ్ల యువ రాజకీయ నాయకుడు షింజిరో కోయిజుమిని ఓడించి నిలిచారు. దీంతో ఆమె దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు.

ఇది కూడా చదవండి: Italy: ఇటలీ విహారయాత్రలో విషాదం.. నాగ్‌పూర్‌కు చెందిన దంపతుల మృతి

షిగేరు ఇషిబా ఇటీవల పదవీ విరమణ చేశారు. దీంతో జపాన్ ప్రధానమంత్రి పదవీ ఖాళీ అయింది. దీంతో షిగేరు ఇషిబా స్థానంలో తకైచి తాజాగా ఎన్నికయ్యారు. అక్టోబర్ 15న పార్లమెంట్‌లో జరిగే ఓటింగ్‌ జరగనుంది. దీంతో జపాన్ తొలి ప్రధానిగా తకైచి రికార్డ్ సృష్టించనున్నారు.

తకైచి.. బ్రిటిష్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అభిమాని. 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనంతరం ప్రభుత్వంలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా అనేక కీలక పాత్రలు నిర్వహించారు. ఇక తకైచి స్వలింగ్ వివాహాన్ని వ్యతిరేకిస్తారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్! అనుమానాలే నిజమయ్యాయి!

Exit mobile version