NTV Telugu Site icon

Ukraine War: రష్యా సైనికుల అకృత్యాలు.. నాలుగేళ్ల చిన్నారిపై దారుణం..తల్లిపై సామూహిక అత్యాచారం..

Ukraine War

Ukraine War

Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు రష్యా సైనికులు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి. గతేడాది ఇద్దరు రష్యన్ సైనికులు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, చిన్నారి తల్లికి తుపాకీ గురిపెట్టి, భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూషన్ ఫైల్స్ ప్రకారం 2022 మార్చినెలలో రాజధాని కీవ్ కు సమీపంలో బ్రోవరీ జిల్లాల్లో 4 ఇళ్లల్లోకి చొరబడి రష్యా 15వ స్పెషల్ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కు చెందిన రష్యన్ సైనికులు లైంగిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

Read Also: Love Marriage : అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి..

గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా విఫలయత్నం చేసింది. ఆ తరువాత బ్రోవరిలోకి ప్రవేశించిన రష్యన్ సైనికులు దోపిడి, లైంగిక హింసకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రజలను బందీలుగా తీసుకుని ముందుగా మహిళలను వేరు చేసి అఘాయిత్యాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మార్చి 13న ఈ సంఘటన జరిగాయి. సైనికులు మద్యం మత్తులో ఒక కుటుంబం ఉన్న ఇంట్లోకి చొరబడ్డారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. భర్తను కొట్టి మోకాళ్లపై నిల్చోెపెట్టి, భార్యపై తుపాకీ ఎక్కుపెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఇద్దరు సైనికుల్లో ఒకరు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది.

32, 28 ఏళ్ల ఇద్దరు సైనికులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని, ఇందులో ఒకరి పేరు యెవ్జెనీ చెర్నోక్నిజ్నీ ఉక్రెయిన్ తెలిపింది. ఈ ఘటనతో పాటు రష్యా సైనికులు మరో ఇంట్లోకి ప్రవేశించి 41 ఏళ్ల గర్భిణి, 17 బాలికపై కూడా అత్యాచారం జరిపినట్లు న్యాయవాదులు తెలిపారు. బాధితులంతా ప్రాణాలతో బయపడినప్పటికీ.. వారంతా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లుగా ప్రాసిక్యూటర్ల తెలిపారు. బ్రోవరీలో జరిగిన దాడుల్లో రష్యా ఉన్నతాధికారులు పాత్రపై కూడా విచారణ జరుగుతన్నట్లు వెల్లడించారు. రష్యా సైనికులు క్రమబద్ధ:గా లైంగిక నేరాలకు పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు. రష్యా ఇప్పటి వరకు 71,000కు పైగా యుద్ధనేరాాలకు పాల్పడినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.

Show comments