NTV Telugu Site icon

Russia-Iran: రష్యా- ఇరాన్‌ అధ్యక్షుల భేటీ..! ఉత్కంఠ రేపుతున్న సమావేశం!

Russiairan

Russiairan

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్-రష్యా అధ్యక్షుల సమావేశం ఆసక్తి రేపుతోంది. హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజిష్కియాన్‌ శుక్రవారం భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తుర్క్‌మెనిస్థాన్‌ రాజధాని ఆష్గాబత్‌లో సమావేశం అయ్యారు. ఈ మేరకు రష్యా మీడియా వెల్లడించింది.

ఇది కూడా చదవండి: Dog Singing Video: ఇంగ్లీష్‌ పాట పాడే కుక్కని చూశారా? ఇక్కడ చూడండి..

ఇద్దరి భేటీలో ద్వైపాక్షిక అంశాలు, పశ్చిమాసియాలో అస్థిర పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి ఇరాన్ సైనిక పరమైన అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన ఎస్‌యూ-35 యుద్ధవిమానాలు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌- 400 వంటి వాటిని ఇరాన్ కోరుతున్నట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..

ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి ఇరాన్‌లో పర్యటించారు. ఇరాన్‌తో తమ మైత్రిని కొనసాగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్‌లోని చమురు, అణు కేంద్రాల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్-రష్యా అధ్యక్షుల సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

ఇది కూడా చదవండి: Manu Bhaker: ష్యాషన్ షోలో అదరగొట్టిన మను భాకర్.. ర్యాంప్‌పై వయ్యారం