NTV Telugu Site icon

Russia-Ukrain: న్యూఇయర్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు

Russia Ukrain

Russia Ukrain

అన్ని దేశాలు కొత్త సంవత్సరం కోసం ఎదురుచూస్తుంటే.. రష్యా మాత్రం ప్రత్యర్థి దేశంపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై భారీస్థాయిలో బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించింది. కీవ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని రష్యా భారీగా క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ వైమానిక దళ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో షోస్ట్కా నగరానికి సమీపంలో ఉన్న పలు నివాస భవనాలు, పాఠశాలలు, వైద్యసదుపాయాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. దేశంలోని దాదాపు సగం మౌలిక సదుపాయాలు నాశనమయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు

ఇదిలా ఉంటే పలు పాశ్చాత్య మిత్రదేశాలు తమకు వాయు రక్షణ వ్యవస్థలను అందించాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. వాటి సహాయంతో రష్యా డ్రోన్లను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ ప్రయోగించిన 68 డ్రోన్లను మంగళవారం తెల్లవారుజామున కూల్చివేసినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. డ్రోన్ శకలాలు చమురు డిపో భూభాగంలో పడడంతో మంటలు చెలరేగాయని అన్నారు. రష్యా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లోని మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేస్తోంది. క్రిస్మస్‌ రోజున కూడా ఉక్రెయిన్‌లోని పలు విద్యుత్‌ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడ్డాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

ఇది కూడా చదవండి: NEW YEAR 2025: నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన విజయవాడ..

Show comments