Russia Ukraine War: రష్యాకు బిగ్‌ షాక్.. మేజర్‌ జనరల్‌ హతం

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా… ఓవైపు చర్చలు అంటూనే.. మరోవైపు భీకర దాడులకు పాల్పడుతోంది… ఇక, అదే స్థాయిలో ఉక్రెయిన్‌ నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతోంది రష్యా బలగాలకు.. ఇరు దేశాలకు చెందిన సైనికులతో పాటు.. ప్రజలు కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు.. కేవలం సైనికులే కాదు.. కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోవడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.. యుద్ధం మొదలై ఎనిమిది రోజులైనప్పటికీ ఉక్రెయిన్‌లో విధ్వంసం మాత్రం కొనసాగుతూనే ఉంది.. యుద్ధం మొదట్లో రష్యా ఆధిపత్యం చెలాయించినట్లు కనిపించినా ఆ తర్వాత ఉక్రెయిన్‌ నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు.. దీంతో.. ఉక్రెయిన్‌తో పాటు రష్యా కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా, ఈ యుద్ధంలో రష్యన్‌ మేజర్‌ జనరల్‌ హతమైనట్లు స్థానిక మీడియా పేర్కొంది… ఎనిమిదో రోజు యుద్ధంలో రష్యన్‌ మేజర్‌ జనరల్‌ అండ్రీ సుఖోవిట్‌స్కీ ప్రాణాలు విడిచినట్టు బెలారస్‌ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.. అయితే, దీనిపై రష్యన్‌ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.

Read Also: Russia-Ukraine War: ఆనంద్‌ మహీంద్రా కొత్త ప్లాన్..!