Site icon NTV Telugu

North Korea And Russia: ఉత్తర కొరియా అధ్యక్షుడితో రష్యా రక్షణ మంత్రి భేటీ.. ఖండాత‌ర బాలిస్టిక్ మిస్సైల్స్ పరిశీలన

North Korea And Russia

North Korea And Russia

North Korea And Russia: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఇరువురు చర్చించారు. ర‌ష్యా ర‌క్షణ మంత్రికి ఐసీబీఎంను కిమ్‌ చూపించారు. ఉత్తర కొరియా ఆయుధ ప్రద‌ర్శన రష్యా మంత్రికి చూపించింది. త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌ను ర‌ష్యా, చైనా ర‌క్షణ ద‌ళాల ముందు ప్రద‌ర్శించింది. హాసాంగ్ ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణిని కూడా ర‌ష్యా ర‌క్షణ మంత్రికి కిమ్ చూపించారు. రెండు దేశాలు ప‌లు ర‌క్షణ అంశాల‌పై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు.

ఉత్తర కొరియా ఇటీవ‌ల ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణి ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. త‌మ వ‌ద్ద ఇంకా అనేక క్షిప‌ణులు ఉన్నట్లు ఆ దేశాధినేత కిమ్ గ‌తంలో తెలిపారు. అయితే కొరియా యుద్ధం 70వ వార్సికోత్సవంలో పాల్గొనేందుకు వ‌చ్చిన ర‌ష్యా ర‌క్షణ మంత్రి సెర్గీ షోయుగుకు.. ఉత్తర కొరియా నేత కిమ్ త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌ను చూపించారు. ప్యోంగ్‌యాంగ్‌లో జ‌రిగిన ఆయుధ ప్రద‌ర్శన‌లో ర‌ష్యా ర‌క్షణ మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా హాసాంగ్ ఖండాత‌ర బాలిస్టిక్ మిస్సైల్‌ను సెర్గీకి కిమ్ చూపించారు. ర‌ష్యాతో పాటు చైనాకు చెందిన ర‌క్షణ‌శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్‌లో ఐసీబీఎంను ఉత్తర కొరియా స‌క్సెస్‌ఫుల్‌గా ప‌రీక్షించిన విష‌యం తెలిసిందే. ఘ‌న ఇంధ‌నం ద్వారా తొలిసారి ఆ క్షిప‌ణిని ప‌రీక్షించారు. ఆయుధ ప్రద‌ర్శన‌లో కొత్తగా త‌యారు చేసిన‌ట్లు రెండు డ్రోన్ డిజైన్లను కూడా ప్రజెంట్ చేశారు. అమెరికా దాడుల స‌మ‌యంలో ఆ దేశం వాడే డ్రోన్ల త‌ర‌హాలో ఆ కొత్త డ్రోన్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న ర‌ష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్నట్లు ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు.

Exit mobile version