ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇంకోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా యుద్ధం కొనసాగుతోంది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తాజాగా డ్రోన్లు, క్షిపణులతో మాస్కో విరుచుకుపడింది. తాజాగా దాడుల్లో 10 మంది చనిపోగా.. నివాసాలు, ఆస్పత్రులు, వాహనాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద ఉన్న వారిని బయటకు తెచ్చేందుకు భద్రతా బలగాలు సహాయ చర్యలు చేపట్టినట్లు ఉక్రెయిన్ తెలిపింది. క్షతగాత్రులకు చికత్స అందిస్తున్నామని.. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Sajjala Ramakrishna Reddy: ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ రికార్డు మెజార్టీలతో గెలుస్తుంది..!
తాజా దాడుల్లో ఉత్తర కొరియాకు చెందిన ఆయుధాలను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఇదిలా ఉంటే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్‌స్కీ పశ్చిమ దేశాలను కోరారు. నివాస భవనాలే లక్ష్యంగా రష్యా దాడి చేస్తోందని.. వాటిని ధ్వంసం చేసిందని పేర్కొన్నారు. అమెరికా మౌనం వల్ల తమ దేశంలో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి. డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించుకుంటున్నాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇటీవల ఇస్తాంబుల్ వేదికగా శాంతి చర్చలు జరిగాయి. దీంతో ఇరు వైపుల యుద్ధ ఖైదీలు విడుదలయ్యారు. ఇక కాల్పుల విరమణపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇంతలోనే ఇరు పక్షాలు దాడులు చేసుకుంటున్నాయి.
