ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను క్రమంగా ఒంటరిని చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇప్పటికే చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఇక, వచ్చే వారం ఐక్యరాజ్య సమితి సాధారాణ సభలో ఓటింగ్ ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఓటింగ్ జరగబోతోంది.. రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రతిపాదించిన తీర్మానంపై ఓటింగ్ ఉండనుంది.. అయితే, రెండోసారి కూడా తటస్థ వైఖరినే అవలంభిస్తోంది భారత్.. ఇక, ఐక్యరాజ్య సమితిలోని 12 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించింది అమెరికా..
Read Also: Gun Firing: ఇబ్రహీంపట్నంలో రియాల్టర్‌పై కాల్పులు..!
మరోవైపు.. ఉక్రెయిన్‌కు మద్ధతుగా రష్యాను దీటుగా ఎదుర్కునేందుకు ఆయుధాలను మరింతగా సరఫరా చేస్తున్నాయి పశ్చిమ దేశాలు. ఇంకా ఆయుధాల సరఫరాను పెంచాలని బ్రిటన్ కోరింది. దీంతో.. యుద్ధం మరింత భీకరంగా సాగే అవకాశం కనిసిప్తోంది.. 2,500 అసల్ట్ రైఫిళ్లను, యుద్ధ ట్యాంక్‌లను ధ్వంసం చేసే 1500 ఆయుధాలను సరఫరా చేసేందుకు అంగీకరించింది ఫిన్‌లాండ్… ఇక, కెనడా కూడా యుద్ధ ట్యాంక్‌లను ధ్వంసం చేసే ఆయుధాలను, ఆధునాతన మందుగుండు సామగ్రిని సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది.. రష్యా అధీనంలో ఉన్న “క్రిమియా” ద్వీపకల్పాన్ని అధికారికంగా గుర్తించడంతో పాటు, ఉక్రెయిన్ తటస్థంగా ఉంటూనే ఈ వివాదానికి పరిష్కారం సాధ్యమవుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నమాట… క్రమంగా ప్రపంచ దేశాల ఆంక్షలు, ఐక్యరాజ్యసమితి ఓటింగ్.. ఇలా రష్యాను ఒంటరిని చేస్తున్నాయి.
