NTV Telugu Site icon

Moscow: మాస్కోను ఠారెత్తిస్తున్న ఎండలు.. వందేళ్ల రికార్డ్ బద్దలు

Heat Wave

Heat Wave

గత వందేళ్లలో ఎన్నడూ లేని ఎండలు రష్యాను హడలెత్తిస్తున్నాయి. ప్రస్తుతంలో రష్యాలో హీట్ వేవ్‌ పరిస్థితులు భీకరంగా కొనసాగుతున్నాయి. జూలై ఆరంభం నుంచి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక గురువారం మాస్కోలో 1917 రికార్డును బద్దలు కొట్టింది. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే మాస్కోలో జూలై 3న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మరింత పెరిగి 1917 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఇక రష్యా అంతటా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంత వేడి వాతావరణం ఉన్న కూడా రష్యన్లు మాత్రం ధైర్యంగానే ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకంపై అధిష్టానందే నిర్ణయం..

రష్యాలోని పసిఫిక్ తీరం, సైబీరియా అడవుల నుంచి యూరోపియన్ భాగాల వరకు హీట్‌వేవ్ రికార్డులు బద్దలయ్యాయి. ఇక వేడి వాతావరణం కారణంగా ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ పెరిగింది. అలాగే ఐస్‌క్రీమ్‌లు, డ్రింక్స్‌ విపరీతంగా సేల్ అవుతున్నాయి. హీట్‌వేవ్‌ను తట్టుకునేందుకు ప్రజలు వీటిపైన ఆధారపడుతున్నారు. ఇక మెట్రో రైళ్లలో ప్రయాణికులకు నీటిని అందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rajasthan: కొంపముంచిన సవాల్.. మంత్రి పదవికి లాల్ మీనా రాజీనామా

మాస్కోలో 20 మిలియన్లకు పైగా జనాభా ఉన్నారు. హీట్‌వేవ్ పరిస్థితులు తీవ్రంగా ఉండడంతో మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటకు వెళ్లొద్దని పేర్కొన్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.