Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
- 35 వేల కిలోమీటర్ల రేంజ్‌తో 'సర్మాట్' క్షిపణి సక్సెస్
- ప్రపంచాన్ని చుట్టేయగల రష్యా కొత్త క్షిపణి
- 'సర్మాట్' క్షిపణిని విజయవంతం: పుతిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: ప్రపంచానికి రష్యా సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ క్షిపణి శక్తి సమతుల్యత ఉలిక్కిపడే ఒక ప్రకటన చేశారు. మాస్కో ఇటీవల అణు సామర్థ్యం గల కొత్త ‘సర్మాట్’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ఆయన చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దీనిని యుద్ధ విధుల్లో మోహరించాలని రష్యా యోచిస్తోందని వెల్లడించారు. ఈ క్షిపణి పరిధి 35,000 కిలోమీటర్లకు పైగా ఉండవచ్చని పుతిన్ అంటున్నారు. ఇదే జరిగితే, ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యధిక పరిధి గల క్షిపణిగా నిలుస్తుంది. అయితే దీని ప్రస్తుత పరిధి 18,000 కిలోమీటర్లుగా ఉందని, ఇప్పటి వరకు ఇదే అత్యధిక పరిధి అని పలు నివేదికలు చెబుతున్నాయి.
సర్మాట్ క్షిపణి ఎందుకు ప్రత్యేకమైనదంటే..
సర్మాట్ క్షిపణి వ్యవస్థ పరీక్ష విజయవంతం అయిన తర్వాత, పొసైడాన్ – బురెస్ట్నిక్ వ్యవస్థలపై పనులు తుది దశలో ఉన్నాయని వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఒరేశ్నిక్కు అణ్వాయుధాలను అమర్చే అవకాశం ఉందని అధ్యక్షుడు చెప్పారు. ఏబీఎం ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో, రష్యా తన వ్యూహాత్మక భద్రతను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సర్మాట్ విజయవంతంగా ప్రయోగించిన తర్వాత, ఈ సంవత్సరం చివరి నాటికి దాని మొదటి రెజిమెంట్‌ను మోహరిస్తారని వ్యూహాత్మక క్షిపణి దళాల కమాండర్ కారకాయెవ్ పేర్కొన్నారు. సార్మాట్ వ్యవస్థ దాని గతంలోని వోయెవోడా క్షిపణి వ్యవస్థ కంటే విధ్వంసక శక్తి, ప్రయోగించే బరువు, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించే సామర్థ్యం వంటి అనేక కీలక అంశాలలో శ్రేష్ఠమైనదని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ సర్మాట్ క్షిపణిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అతిశయోక్తి వాదనలు చేశారని పాశ్చాత్య భద్రతా విశ్లేషకులు అంటున్నారు. గతంలో సర్మాట్ వైఫల్యాలను చవిచూసిందని చెబుతున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!