NTV Telugu Site icon

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్లాన్ సీ దాడుల‌కు పాల్ప‌డ‌నుందా?

ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య క్ష‌ణ‌క్ష‌ణానికి ప‌రిస్థితులు మారిపోతున్నాయి. ఏ క్ష‌ణంలో యుద్ధం సంభ‌విస్తుందో అని భ‌య‌ప‌డుతున్నారు. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడులు చేసేందుకు మూడు వైపుల నుంచి సైన్యం రెడీగా ఉన్న‌ది. యుద్దాన్ని నివారించేందుకు ప్ర‌పంచ‌దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే, తాము ఉక్రెయిన్‌పై దాడులు చేయ‌బోమ‌ని ర‌ష్యా చెబుతున్నా ప‌రిస్థితులు చూస్తుంటే ఏక్ష‌ణంలో దాడులు జ‌రుగుతాయో అని భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు వ‌స్తాయో అని ఆందోళ‌న చెందుతున్నారు.

Read: Corbevax: పిల్ల‌ల కోసం అత్య‌వ‌స‌ర అనుమ‌తి…

ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్లాన్ సీ ని అమ‌లు చేయ‌బోతుంద‌నే వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. ప్లాన్ సీ అంటే అర్థం సైబ‌ర్ దాడులు. ఉక్రెయిన్‌పై సైబ‌ర్ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతున్నారు. గ‌తంలోనూ అనేక‌మార్లు ఉక్రెయిన్‌పై ర‌ష్యా సైబ‌ర్ దాడులు చేసింది. కానీ, ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో దాడులు జ‌రిగితే దాని వ‌ల‌న ఆ దేశం తీవ్రంగా న‌ష్ట‌పోవ‌ల‌సి వ‌స్తుంది. అంతేకాదు, ఈ దాడులు బ్యాంకింగ్ రంగాల‌పైనే కాకుండా, ర‌క్ష‌ణ రంగంపై కూడా జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు అమెరికా వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే, తాము ఎలాంటి దాడులు చేయ‌డం లేద‌ని ర‌ష్యా చెబుతున్నా ప్ర‌పంచం మాట‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.