NTV Telugu Site icon

Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. తృటిలో తప్పిన ప్రమాదం

Russia President Putin

Russia President Putin

Putin Assassination Attempt: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. యూరో వీక్లీ న్యూస్ ఈ విషయాలను వెల్లడించింది. పుతిన్ పై హత్యాయత్నం జరిగినట్లు బుధవారం జనరల్ జీవీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ ఈ సమాచారాన్ని విడుదల చేసినట్లు తెలిపింది. అయితే ఈ హత్యాయత్నం ఎప్పుడు జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడికి పాల్పడుతున్నప్పటి నుంచి పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని.. అతని ప్రాణాలకు ముప్పు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అధ్యక్షుడు పుతిన్ అధికారిక నివాసం క్రెమ్లిన్ కు వెళ్లే క్రమంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పుతిన్ కాన్వాయ్ లోని లిమోసిన్ కారు ముందు చక్రం భారీ శబ్ధంతో పేలిపోయిందని.. అయితే పొగలు వస్తున్నా కూడా సిబ్బంది కారును ప్రమాదం నుంచి బయటపడేశారని తెలుస్తోంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడు క్షేమంగానే ఉన్నారని.. అయితే పలువురిని అరెస్ట్ చేసినట్లు యూరో వీక్లీ వెల్లడించింది. పుతిన్ తన నివాసానికి వెళ్లే క్రమంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో పుతిన్ కాన్వాయ్ కు ఓ అంబులెన్స్ అడ్డుగా వచ్చిందని.. అయితే కాన్వాయ్ లోని మరో వాహనం ఆపకుండా వెళ్లిపోయిందని.. ఆ తరువాత బ్యాకప్ కాన్వాయ్ లో పుతిన్ ను సురక్షితంగా తరలించినట్లు తెలిపింది. అధ్యక్షుడి కాన్వాయ్ లో భద్రతా లోపం ఏర్పడటంతో పుతిన్ సెక్యురిటి సర్వీస్ కు చెందని పలువురు అధికారులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Minister KTR : స్టూడెంట్స్ జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ క్రియేటర్ గా తయారవ్వాలి

పుతిన్ పై ఇప్పటికే ఐదు సార్లు హత్యాయత్నాలు జరిగినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. అయితే ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యాలోని కొంతమంది ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని వారు విమర్శిస్తున్నారు. పుతిన్ పై దేశ ద్రోహంతో పాటు.. అధికారాన్ని తొలగించాలని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన రాజకీయ నాయకుల బృందం స్టేట్ డూమాకు విజ్ఞప్తి చేశారు. సెయింట్ పీటర్స్‌బర్గ్, మాస్కో మరియు అనేక ఇతర ప్రాంతాలకు చెందిన 65 మంది మునిసిపల్ ప్రతినిధులు పుతిన్ రాజీనామాకు పిలుపునిస్తూ సోమవారం ఓ పిటిషన్ పై సంతకాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.