చేయని తప్పుకు ఇద్దరు సోదరులు ముప్పై ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారు. 30 ఏళ్ల తరువాత వారు తప్పు చేయలేదని తెలియడంతో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేశారు. అయితే, చేయని తప్పుకు శిక్ష అనుభవించి విలువైన కాలాన్ని కోల్పోయిన ఇద్దరు అన్నదమ్ములు కోర్టులో కేసు ఫైల్ చేయగా కోర్టు వారికి రూ.550 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘటన అమెరికాలోని నార్త్ కరోలీనాలో జరిగింది. 1983లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారనే కేసులో హేన్రి కాలమ్, లియోన్ బ్రౌన్ అనే ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, 2014 లో డిఎన్ఏ పరీక్షలో వీరు తప్పు చేయలేదని తేలడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. విడుదలైన తర్వాత సోదరులు నార్త్ కరోలీనా కోర్టులో కేసు ఫైల్ చేయగా వారికీ పరిహారం అందించాలని తీర్పు ఇచ్చింది.
చేయని తప్పుకు ముప్పై ఏళ్ల జైలు శిక్ష… ఆ సోదరులకు రూ.550 కోట్ల పరిహారం
