పాకిస్తాన్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో 40 మందికి గాయాలయ్యాయి. బక్రీద్ పండుగ సందర్భంగా సుమారు 70మందికి పైగా కార్మికులు సియాల్‌కోట్ నుంచి రజన్‌పూర్‌కు పయనమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం ముజప్పర్‌గడ్‌లోని డేరాఘాజీ ఖాన్ వద్ద ఇండస్ హైవేపై ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో గంటన్నరలో ఇంటికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక చికిత్సపొందుతున్న వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
పాక్‌లో రోడ్డు ప్రమాదం…30 మంది మృతి…
