Site icon NTV Telugu

Harvard Medical School: వయస్సును వెనక్కి తీసుకొస్తామంటున్న పరిశోధకులు

Harvard Medical School

Harvard Medical School

Harvard Medical School: కాలాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేము. అలాగే గడిచిపోయిన వయసును సైతం వెనక్కి తీసుకురాలేము. కొన్ని సినిమాల్లో గడచిన కాలంలోకి తీసుకెళ్లినట్టు.. అలాగే భవిష్యత్‌లోకి తీసుకెళ్లినట్టు చూపించారు. కానీ వాస్తవానికి అదిసాధ్యం కాదు. పెరుగుతున్న శాస్ర్త సాంకేతిక ఆధారంగా కొత్త కొత్త విషయాలను కనుగొంటున్నారు. అందులో భాగంగా .. గడచి పోయిన వయసును మాత్రం వెనక్కి తిప్పగలం అంటున్నారు అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన పరిశోధకులు. ఒకఆ కథేంటో తెలుసుకుందాం..

Read also: Shadnagar: షాద్‌నగర్‌లో పేలిన సిలిండర్.. 11 మందికి తీవ్ర గాయాలు

కాలం, వయసు ఒకసారి దాటిపోతే తిరిగి రావు అనేది నానుడి. కాలం విషయం అలా ఉంచితే, వయసును మాత్రం మేం వెనక్కి తిప్పగలం అంటున్నారు అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు. ఈ మేరకు అటు చిట్టెలుకలు, ఇటు మనుషుల కణాల్లో వయసును అనేక సంవత్సరాలు వెనక్కి తిప్పే సామర్థ్యం కలిగిన ఆరు రకాల రసాయనాల మిశ్రమ పానీయాన్ని(కాక్‌టెయిల్‌) కనుగొన్నామని వారు వివరించారు. ‘‘జన్యు చికిత్స ద్వారా పిండ జన్యువులను క్రియాశీలం చేసి వయసును వెనక్కి తిప్పడం సాధ్యమే. కాక్‌టెయిల్‌లో వినియోగించే రసాయనాల్లో చాలా వరకూ మనిషిలోని శారీరక, మానసిక రుగ్మతల్ని తొలగించేవే ఉన్నాయి. కంటి నరాలు, మెదడు కణజాలం, మూత్రపిండాలు, కండరాలపై కాక్‌టెయిల్‌ అద్భుతంగా పనిచేసింది. చిట్టెలుకల్లో జీవనకాలం గణనీయంగా పెరిగింది. కోతుల్లో కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. వచ్చే ఏడాది కల్లా మనుషులపై పూర్తిస్థాయిలో ప్రయోగాలను ప్రారంభించే అవకాశం ఉందని పరిశోధకులు స్పష్టం చేశారు. త్వరలోనే మనిషి వయసు వెనక్కి తిప్పే సాంకేతికత కూడా అందుబాటులోకి వస్తుందన్నమాట.

Exit mobile version