Site icon NTV Telugu

Pink Diamond: అత్యంత అరుదైన పింక్ డైమండ్‌కు రికార్డు ధర.. ఎంతో తెలుసా..?

Pink Diamond

Pink Diamond

Rare Pink Diamond Sells For Record Price: ప్రపంచంలో వజ్రాలకు చాలా డిమాండ్ ఉంది. ఏంతగా అంటే వందల కోట్లు పెట్టి మీర వజ్రాలను కొనుగోలు చేస్తుంటారు కొందరు. వజ్రాల్లో పింక్ డైమండ్ కు మరింత ఎక్కువ డిమాండ్ ఉంది. తాజాగా ఓ పింక్ డైమండ్ కు రికార్డు ధర పలికింది. హాంకాంగ్ లో వేలం వేయగా.. అమెరికా ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి రికార్డు ధరతో కొనుగోలు చేశారు.

Read Also: 6 Airbags: కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ రూల్స్.. కేంద్రానికి ఎదురుదెబ్బ..!

హాంకాంగ్ వేలంలో పింక్ డైమండ్ దాదాపుగా 57.7 మిలియన్లకు అమ్ముడైంది. అంటే భారత కరెన్సీలో రూ. 478 కోట్లు పలికింది. 11.15 క్యారెట్లు ఉన్న ఈ గులాబీ వజ్రం విలియమ్ పింక్ స్టార్ శుక్రవారం భారీ ధరకు అమ్ముడయింది. ఏ ఆభరణానికైనా రెండవ అత్యధిక ధర ఇదే. నిజానికి వజ్రం వేలం ధర 21 మిలియన్ డాలర్లే అయితే దీనికి రెండు రెట్లు బిడ్డింగ్ వేసి ఫ్లోరిడాలోని బోకా రాటన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి గెలుచుకున్నారు. కొనుగోలుదారుడి వివరాలను రహస్యంగా ఉంచారు.

అంతర్జాతీయ మార్కెట్ లో పింక్ డైమండ్స్ కు చాలా డిమాండ్ ఉంది. భూమిపై అత్యంత అరుదుగా లభించే వజ్రం కావడంతో దీన్ని కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం విక్రయించబడింది రెండవ అతిపెద్ద గులాబీ వజ్రం. సీటీఎఫ్ పింక్ స్టార్ గా పిలువబడి గులాబీ వజ్రాన్ని 2017లో వేలం వేస్తే 71.2 మిలియన్ డాలర్లు పలికింది. దాని తరువాత ఇప్పుడే రికార్డు ధర లభించింది.

Exit mobile version