Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin – Abbas Araghchi Meeting: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ – ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన భేటీ అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సోమవారం రష్యా చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పుతిన్ నేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరాన్‌కు రష్యా తన పూర్తి మద్దతును ప్రకటించడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.
ప్రోటోకాల్‌ను కాదని పుతిన్ భేటీ..
సాధారణంగా ఏ దేశ విదేశాంగ మంత్రి అయినా మరో దేశానికి వెళ్లినప్పుడు అక్కడి విదేశాంగ మంత్రిని మాత్రమే కలుస్తారు. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పుతిన్ స్వయంగా అరాఘ్చీని ఆహ్వానించి చర్చలు జరపడం ఈ భేటీ ప్రాధాన్యతను చాటిచెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన తరుణంలో ఈ సమావేశం జరగడం గమనార్హం. ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ నుంచి తనకు ఒక ప్రత్యేక సందేశం అందిందని పుతిన్ ఈ సందర్భంగా వెల్లడించారు. పుతిన్ మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. రెండు దేశాల అగ్ర నాయకత్వాల మధ్య దౌత్య సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని స్పష్టం చేశారు.
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌కు పుతిన్ ఇచ్చిన హామీలు ఇవే..
ఇరాన్ ప్రయోజనాల కోసం, ఆ ప్రాంతంలోని ఇతర దేశాల శ్రేయస్సు కోసం రష్యా శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పుతిన్ హామీ ఇచ్చారు. టెహ్రాన్‌తో మాస్కో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దీని అర్థం.. కేవలం వాణిజ్యమే కాకుండా సైనిక, రాజకీయ అంశాల్లోనూ రెండు దేశాలు ఒకదానికొకటి వెన్నుదన్నుగా నిలవనున్నాయి. ఈ క్లిష్ట కాలాన్ని అధిగమించి త్వరలోనే ఇరాన్‌లో శాంతి నెలకొంటుందని రష్యా ఆశిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. ఈ భేటీతో ఇరాన్ ఒంటరి కాదని, రష్యా వంటి అగ్రరాజ్యం దాని వెనుక ఉందని ప్రపంచానికి స్పష్టమైన సంకేతం వెళ్లింది. ఇది ఒక రకంగా ప్రపంచం రెండు వర్గాలుగా విడిపోయిందని సూచిస్తోందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఒకవైపు అమెరికా, యూరప్, దాని మధ్యప్రాచ్య మిత్రదేశాలు ఉండగా.. మరోవైపు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న రష్యా – ఇరాన్ మొదలైన దేశాలు ఉన్నాయి. రష్యా అండతో ఇరాన్ ఇకపై అంతర్జాతీయ వేదికలపై, చర్చల్లో మరింత వ్యూహాత్మకంగా, బలంగా తన గళాన్ని వినిపించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!