Site icon NTV Telugu

Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్

Untitled Design (5)

Untitled Design (5)

టర్కీలోని మానిసాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాల ప్రిన్సిపాల్ 13 ఏళ్ల ఆటిజం విద్యార్థిని బలవంతంగా మెట్లపై నుంచి కిందకు తోసేసాడు. అయితే ఈ సంఘటన దేవ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకేత్తించింది. విద్యార్థిని తోసేసిన దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

Read Also: Car Stuck in Flyover: ఫ్లై ఓవర్ గ్యాప్ లో ఇరుక్కున్న కారు.. రక్షించిన స్థానికులు

అయితే.. ఓ పాఠశాల చెందిన అటిజం విద్యార్థిని.. అక్కడే మెట్ల దగ్గర వేచి ఉన్న ప్రిన్సిపల్ బలవంతంగా విద్యార్థి చేయిపట్టకుని కిందకు తోసేసాడు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. అధికారులు ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హజరుపరిచారు. అయితే తనకు.. ఆ పిల్లవాడికి ఎలాంటి హాని కలిగించే ఉద్దేశ్యం లేదని కోర్టులో ప్రిన్సిపాలు తెలిపాడు. ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు టర్కీ న్యాయ శాఖ మంత్రి. అనంతరం ఈ ఘటనను తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని.. అలాగే కిందపడి గాయపడిన విద్యార్థికి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Read Also: iBomma: ఐ బొమ్మలో సినిమాలు చూశారా? తస్మాత్ జాగ్రత్త

అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో… నెటిజన్లు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం కూడా దయ లేకుండా అలా ఎలా చేశావంటూ కామెంట్స్ పెడుతున్నారు. విద్యార్థి తొందరగా కోలుకోవాలని నెటిజన్లు దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

Exit mobile version