NTV Telugu Site icon

Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..

Ukraine Power Plant

Ukraine Power Plant

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా ఉన్న జపొరిజ్జియా మరోసారి వార్తల్లో నిలిచింది. యూరప్ లోనే అతిపెద్ద అణు విద్యుత్ కర్మాగారం ఇక్కడే ఉంది. ఇదిలా ఉంటే జపొరిజ్జియా అణు కర్మాగారాన్ని, ఉక్రెయిన్ విద్యుత్ గ్రిడ్‌కి అనుసంధానించే రెండు విద్యుత్ లైన్లను రాత్రిపూట కట్ చేశారు. దీంతో ప్లాంట్‌కి ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ శనివారం తెలిపింది. గతేడాది ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు పక్షాలు కూడా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడే ఉన్న అణు ప్లాంట్ ప్రమాదంలో పడింది.

ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన కారణంగా.. అణు విద్యుత్ ప్లాంట్ 20 డిజిల్ జనరేటర్ల నుంచి సొంత అవసరాలకు శక్తిని సమకూర్చుకుంటోందని ఉక్రెయిన్ న్యూక్లియర్ ఎనర్జీ ఆపరేటర్ చెప్పారు. విద్యుత్‌ని పునరుద్ధరించే వరకు ప్లాంట్ ‘న్యూక్లియర్, రేడియేషన్ యాక్సిడెంట్’ ప్రమాదం అంచున ఉందని పేర్కొంది. ఉక్రెయిన్ పవర్ గ్రిడ్ నుంచి ప్లాంట్‌కి విద్యుత్ సరఫరా పునరుద్దరించిన ఉక్రెయిన్ నిపుణులు, సత్వర చర్యల ద్వారా ప్రమాదాన్ని నివారించినట్లు పేర్కొంది.

Read Also: MLA Jakkampudi Raja: అజ్ఞాన చక్రవర్తి లోకేష్ బాబు.. ముందు లెక్కలు నేర్చుకో నాయనా!

రష్యా-ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత ఇలా బ్లాక్ అవుట్ కావడం ఇది 8వ సారని, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ శనివారం ధృవీకరించింది. అధికారులు ప్లాంట్‌లో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఓవర్ హీటింగ్ కాకుండా నిరంతరం నిర్వహణ చర్యలను చేపడుతున్నారు. జపోరిజ్జియాలోని ఆరు రియాక్టర్ల ప్లాంట్ గత 21 నెలల సంఘర్షణల్లో పదేపదే దాడికి గురవుతోంది. డ్రోన్ దాడులతో ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ 2022లో ఉక్రెయిన్ గ్రిడ్‌కి విద్యుత్ సరఫరాని నిలిపేసింది.

Show comments