Site icon NTV Telugu

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్‌ మరణం తర్వాత ఏం జరగనుంది.. ఎక్కడ ఖననం చేస్తారంటే..?

Pope

Pope

Pope Francis: రోమన్ కాథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఇవాళ (ఏప్రిల్ 21న) తుదిశ్యాస విడిచారు. అయితే, సాధారణంగా పోప్ అంత్యక్రియలను సంప్రదాయబద్దంగా జరుగుతాయి. కానీ, చాలా క్లిష్టమైన ఆ పద్దతిలో మార్పులు చేయాలని ఇటీవల దివంగత పోప్ ఫ్రాన్సిస్ సూచించారు. దీని కోసం ఆయన కొన్ని ప్లాన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో పోప్‌ల‌కు మూడు అంచెలున్న శవపేటికల్లో ఖననం చేసే ఆచారం ఉండేది. సైప్రస్ చెట్టు, సీసం, సింధూర వృక్షంతో తయారు చేసిన శవపేటికలో పోప్ పార్థివదేహాన్ని తరలించేందుకు ఉపయోగించేవారు. కాగా, అలాంటి శవపేటికలకు స్వప్తి చెప్పారు పోప్ ఫ్రాన్సిస్‌. చాలా సింపుల్‌గా ఉండే.. చెక్క శవపేటికలో తన పార్థివదేహాన్ని ఉంచాలని ఇటీవల ఆయన కోరారు. కాగా, ఫ్రాన్సిస్ కోసం ఇప్పుడు జింక్ ఖనిజ పట్టీతో ఆ శవపేటికను సిద్ధం చేయనున్నారు.

Read Also: Sivalenka Krishna Prasad: అందరినీ హాయిగా ఎంటర్టైన్ చేసేలా ‘సారంగపాణి జాతకం’: నిర్మాత శివలెంక

ఇక, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో ప్రజల సందర్శనార్థం ఎత్తుగా ఉండే కాటాఫల్క్ ప్రదేశంలో పోప్ ఫ్రాన్సిస్ పార్థవదేహాన్ని ఉంచుతారు. ఆయనను చివ‌రి చూపు చూడాల‌నుకునే వారు.. పోప్ పార్దీవ‌దేహాన్ని శ‌వ‌పేటిక‌లోనే చూసేందుకు అవకాశం కల్పించారు. ఆ శ‌వ‌పేటిక పై క‌ప్పును తీసి ఉంచ‌ుతారు. అయితే, వాటికన్ సిటీ కాకుండా మ‌రో ప్రదేశలో రోమ‌న్ క్యాథ‌లిక్ చ‌ర్చి మత పెద్దను ఖననం చేయడం త శ‌తాబ్ధ కాలంలో ఇదే మొదటి కానుంది. రోమ్‌లోని సెయింట్ మేరీ మేజ‌ర్ బాసిలికా చ‌ర్చిలో పోప్ ఫ్రాన్సిస్‌ను ఖ‌న‌నం చేయనున్నారు.

Exit mobile version