పోప్ ఫ్రాన్సిస్ వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పలుమార్లు కిందపడి పోవడంతో గాయాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటినా రోమ్ ఆస్పత్రికి తరలించారు. రెగ్యులర్ పరీక్షలు మరియు బ్రోన్కైటిస్ చికిత్స కోసం పోప్ ఫ్రానిస్ ఆస్పత్రిలో చేరారని వాటికన్ సిటీ శుక్రవారం ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Naa Love Story: RX100 దర్శకుడి చేతుల మీదుగా..”నా లవ్ స్టోరీ” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
ఫిబ్రవరి 6న పోప్ ఫ్రాన్సిస్‌కు బ్రోన్కైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినా కూడా ఆయన నివాసమైన కాసా శాంటా మార్టాలో విధులు నిర్వర్తించారు. అంతేకాకుండా ఆదివారం యథావిధిగా ప్రార్థన కార్యక్రమాలకు అధ్యక్షత వహించారని వాటికన్ తెలిపింది. పోప్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. యవ్వనంలో ఉండగా ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని తొలగించారు. ఇక శీతాకాలంలో తరుచుగా తీవ్రమైన బ్రోన్కైటిస్‌తో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. ఇటీవల రెండు సార్లు పడిపోవడంతో చెయి విరగడం.. గడ్డం దగ్గర గాయాలయ్యాయి. ప్రస్తుతం పోప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: అమెరికా టూర్ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్న మోడీ