Site icon NTV Telugu

Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేద దేశాలు ఇవే.. ఐఎంఎఫ్ నివేదిక..

Poorest Countries

Poorest Countries

Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేదదేశాలుగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) తలసరి జీడీపీ ఆధారంగా కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)ని హైలెట్ చేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. జీడీపీ ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక ఉత్పత్తికి కొలమానంగా ఉంటే, పీపీపీ అనేది ప్రజల జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉంది. ఈ దేశ జీడీపీ తలసరి పీపీపీ 492.72 డాలర్లుగా ఉంది. 2011లో పొందిన ఈ దేశం రాజకీయ అస్థిరతతో, ఘర్షణలతో సవాళ్లను ఎదుర్కొంటోంది.

Read Also: MLC Kavitha Petition: నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌ విచారణ

దక్షిణ సూడాన్‌తో పాటు బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, మలావి, నైజర్, చాడ్, లైబీరియా, మడగాస్కర్ దేశాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో అంతర్గత ఘర్షణలు, వర్షాధార వ్యవసాయంపై ఆధారపడటం వంటివి దేశ పేదరికానికి కారణమవుతున్నాయి. ప్రపంచంలో లక్సెంబర్ తలసరి జీడీపి పరంగా ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా ఉంది. ఈ దేశ తలసరి జీడీపీ పీపీపీ 1,45,834 డాలర్లుగా ఉంది. భారత్ 9.89 వేల డాలర్లుగా ఉంది.

Exit mobile version