Political crisis in Nepal.. Prachanda came out of the coalition: హిమాలయదేశం నేపాల్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. నేపాలీ పార్టమెంట్ లో సంఖ్యాపరంగా మూడో అతిపెద్ద పార్టీ అయిన మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుప్ప కమల్ దహల్ (ప్రచండ) సంకీర్ణ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకున్నాడు. ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాడు. దీంతో సంక్షీర్ణం డోలాయమానంలో పడింది. సంకీర్ణం ముగిసినట్లు నేపాలీ కాంగ్రెస్ పార్టీ ధృవీకరించారు. సంకీర్ణ సమావేశం నుంచి వాకౌట్ చేసిన ప్రచండ ఆదివారం మధ్యాహ్నం ప్రతిపక్ష నేత కేపీ శర్మ ఓలీని కలిసేందుకు బాల్‌కోట్‌కు వెళ్లారు.
మూడేళ్ల క్రితం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ లో విభేదాల కారణంగా రెండుగా విడిపోయింది. ఆ సమయంలో ప్రచండ, కేపీ శర్మ ఓలీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవల నేపాల్ దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగాయి. సంకీర్ణ ప్రభుత్వానికి నేపాల్ ప్రజలు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటల లోపు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ప్రచండకు ప్రధాని పదవి రాకపోవడతో కూటమి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also: India’s Cuisine: ప్రపంచంలో అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్‌కు ఐదోస్థానం
ఇదిలా ఉంటే నేపాల్ ప్రధానిగా కావాలని ప్రచండ కోరుకుంటున్నారు. అయితే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నేపాలీ కాంగ్రెస్ సంకీర్ణాన్ని లీడ్ చేయాలని భావిస్తోంది. నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానిని ఏడు రోజుల్లో సిఫారసు చేయాలని విధించిన గడువు ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో నేపాల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏకాభిప్రాయంతో ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలని అధ్యక్షురాలు కోరింది.
ఇదిలా ఉంటే నేపాల్ ప్రధానిగా పుప్ప కమల్ దహల్ ఎన్నుకునేందుకు రంగం సిద్ధం అయింది. ఆరు పార్టీలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నాయి. అయితే చేరో రెండున్నరేళ్లు ప్రధాన మంత్రి పదవిని పంచుకునేందుకు దహాల్, కేపీ ఓలీశర్మ పార్టీలు అంగీకరించినట్లు తెలుస్తోంది.