London: ఎయిర్‌పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
- లండన్ ఎయిర్‌పోర్టులో అమానుషం
- ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రయాణికుల పట్ల భద్రతా సిబ్బంది అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే చల్లి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Olympics 2024: ఆరు పదుల వయసులో ఒలింపిక్స్ లోకి అడుగు పెడుతున్న బామ్మ..
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- China: "మనం శత్రువులం కాము".. భారత్‌కు చైనా సందేశం..
లండన్‌లోని మాంచెస్టర్ ఎయిర్‌పోర్టులో మంగళవారం రాత్రి నలుగురు ప్రయాణికులకు-భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరువురి మధ్య కొట్లాటకు దారి తీసింది. అక్కడకు చేరుకున్న పోలీసుల మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. ఇక అంతే.. ప్రయాణికుల్ని పోలీసులు చితకబాదారు. చేతులు వెనక్కి మడిచి నేలకేసి కొట్టారు. ఇష్టానుసారంగా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్పృహ కోల్పోయేలా చావబాదారు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రయాణికులంతా ఆందోళన కూడా చేశారు. ప్రస్తుతం నెట్టింట వీడియో వైరల్‌గా మారింది. పోలీసుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంత దారుణంగా కొడతారా? అంటూ నిలదీస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tattoo artist: శవమై కనిపించిన మహిళా టాటూయిస్ట్. పరారీలో ప్రియుడు..
ఈ ఘటన అంతర్జాతీయంగా రచ్చ రచ్చ కావడంతో గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు స్పందించారు. ప్రయాణికులు చేసింది తప్పే కానీ… వారితో ముగ్గురు పోలీసులు ప్రవర్తించిన తీరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడిన ఓ పోలీసును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ మహిళా పోలీసు ముక్కుకు తీవ్ర గాయమైంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Manchester Airport last night This can not go unchallenged. This is absolutely brutal and disgusting. Make this go viral
These officers need to be fired pic.twitter.com/OyVkQapnbV
— Imam Ibrahim M Noonan of AMA Ireland & NI (@ImamNoonan) July 24, 2024
తాజావార్తలు
-
Most Valuable Celebrities list : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
-
AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
-
Vaibhav Sooryavanshi: అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన వైభవ్ సూర్యవంశీ!
-
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!