NTV Telugu Site icon

PM Modi: బ్రిక్స్ దేశాల సమావేశాల్లో పాల్గొననున్న ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: బ్రిక్స్ దేశాల సమావేశాల్లో పాల్గొనడానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికాకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. బ్రిక్స్‌సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ సారి బ్రిక్స్‌ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని మోడీ స్పష్టం చేశారు.

Read also: DK Aruna : ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనాలని కేసీఆర్ అనుకుంటున్నాడు

పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్‌ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని ట్విట్టర్‌ ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను… బ్రిక్స్‌-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్‌ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారిందని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని మోడీ .. నేటి నుంచి – 24 వరకు 15వ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత బ్రిక్స్‌ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమవేశం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరు కావడం లేదు. పుతిన్‌కి బదులు ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించింది.