PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం
- ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- ఎల్పీజీ సరఫరాలపై యూఏఈతో భారత్ కీలక ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీ నుంచి యూఏఈకి బయల్దేరి వెళ్లారు. ఇక అబుదాబి చేరుకోగానే మోడీకి ప్రత్యేక గౌరవం లభించింది. ఎఫ్-16 యుద్ధ విమానాలు మోడీ విమానానికి రక్షణగా వెళ్లాయి. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధం బహిర్గతం అయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక అబుదాబిలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి రాష్ట్రపతి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గౌరవ వందనంతో స్వాగతం పలికారు. మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు, ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఇంధన భద్రత దృష్ట్యా భారతదేశానికి ఈ పర్యటన ముఖ్యమైనది. ఇక పర్యటనలో భాగంగా యూఏఈతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎల్పీజీ సరఫరాలపై యూఏఈతో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌లపై యూఏఈతో భారత్ ఎంవోయూ చేసుకుంది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై కూడా యూఏఈతో ఒప్పందం చేసుకుంది.
Also Read
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
- Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్‌తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
యూఏఈ భారతదేశానికి మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గత 25 ఏళ్లలో ఇది ఏడవ అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. యూఏఈలో 45 లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు. యూఏఈ అనంతరం ప్రధాని మోడీ నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, చివరగా ఇటలీలో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.
ఇక యూఏఈపై ఇరాన్ దాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఇక పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలపై ఉందని చెప్పారు. హార్ముజ్ విషయంలో అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేశాయి. పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలు నష్టపోయాయి.
PM Modi’s aircraft being escorted into Abu Dhabi by UAE Air Force F-16 Block 60 ‘Desert Falcon’ fighters. pic.twitter.com/rsTfVMWaEq
— Shiv Aroor (@ShivAroor) May 15, 2026
PM @narendramodi has embarked on a 5-nation tour, including UAE, the Netherlands, Sweden, Norway and Italy.
Over the next six days, PM will engage with several world leaders across a wide-ranging agenda aimed at strengthening India’s global partnerships.
His first stop will be… pic.twitter.com/i6UiHrQ7Fq
— Randhir Jaiswal (@MEAIndia) May 15, 2026
PM Narendra Modi tweets, "Had excellent discussions with my brother, His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan. Reiterated our strongest condemnation of the attacks on the UAE. Also appreciated my brother’s leadership, courage and wisdom, which have been evident throughout… pic.twitter.com/086Fv2Z6ko
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!