Site icon NTV Telugu

PM Narendra Modi: అత్యంత పవర్ ఫుల్ ప్రధానుల్లో మోడీ ఒకరు.. బ్రిటన్ ఎంపీ ప్రశంసలు

Pm Narendra Modi

Pm Narendra Modi

PM Modi is one of the most powerful persons on planet: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ఇటు ఇండియాలోను అటు యూకేలోనూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు దెబ్బతినకుండా పలువురు బ్రిటన్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు జల్లుకురిపిస్తున్నారు. తాజాగా యూకే చట్టసభ సభ్యుడు కరణ్ బిలిమోరియా మాట్లాడుతూ.. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని ఆయన అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశిస్తూ.. ‘‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఇది ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రైలు–ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. రాబోయే దశాబ్దాలలో UK దాని సన్నిహిత మరియు అత్యంత విశ్వసనీయ స్నేహితుడు మరియు భాగస్వామిగా ఉండాలి’’ అని యూకే పార్లమెంట్ లో అన్నారు.

Read Also: Kiren Rijiju: సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువా..? మోదీ డాక్యుమెంటరీపై కేంద్రమంత్రి

చెప్పాలంటే నరేంద్రమోదీ చిన్నతనంలో గుజరాత్ రైల్వే స్టేషన్ లో తన తండ్రి టీ స్టాలో టీ అమ్మాడు. ఈ రోజు భారతదేశ ప్రధాన మంత్రిగా ఈ గ్రహంపై అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉన్నారని యూకే ఎంపీ లార్డ్ కరణ్ బిలిమోరియా అన్నారు. ప్రస్తుం భారతదేశం జీ20 అధ్యక్ష పదవిని కలిగి ఉంది. రాబోయే 25 ఏళ్లలో 32 బిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలనే దృక్ఫథాన్ని కలిగి ఉంది అని ఆయన అన్నారు. భారత్ ఇప్పుడు యూకేని అధిగమించి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని అన్నారు. 140 కోట్ల ప్రజలను కలిగి, అతివేగంగా అభివృద్ధి చెందుతుందని పార్లమెంట్ లో వెల్లడించారు.

75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఇప్పుడు భారత్ యువదేశం, గత ఆర్థిక సంవత్సరంలో 8.7 శాతం వృద్ధి రేటును కలిగి ఉండి.. పునరుత్వాదక శక్తి, సౌరశక్తితో నాలుగో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని.. మహమ్మారి సమయంలో భారత్ బిలియన్ల కొద్దీ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసిందని అన్నారాయన. భారత్ తో యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బాగా అభివృద్ధి చెందిందని.. భారతదేశం యూకే 12వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని అన్నారు. బలియోరియా, కోబ్రా బీర్ పార్టనర్‌షిప్ లిమిటెడ్ ఛైర్మన్ – మోల్సన్ కూర్స్‌తో జాయింట్ వెంచర్, మోల్సన్ కూర్స్ కోబ్రా ఇండియా ఛైర్మన్, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపక ఛైర్మన్ గా ఉన్నారు. భారత-యూకే సంబంధాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉన్నారు.

Exit mobile version