Site icon NTV Telugu

PM Modi: భూటాన్ చేరుకున్న మోడీ.. ఘనస్వాగతం పలికిన భూటాన్‌ ప్రధాని

Modi3

Modi3

ప్రధాని మోడీ భూటాన్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం ఉదయం భూటాన్‌కు బయల్దేరి వెళ్లారు. థింపు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. భూటన్ ప్రభుత్వ పెద్దలు స్వాగతం పలికారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొననున్నారు.

ఇది కూడా చదవండి: Amit Shah: కాసేపట్లో అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం

ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలం దగ్గర పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇక నిందితుడికి సంబంధించిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధాని మోడీ భూటాన్‌కు బయల్దేరే ముందు హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి తాజా సమాచారాన్ని తెలుసుకున్నారు.

 

Exit mobile version