Plane Crash In Montgomery: విమానం కుప్పకూలింది.. 90 వేల ఇళ్లకు పవర్ పోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane crashes into power lines in Montgomery County in US: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం కుప్పకూలిన సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యుత్ లైన్లపైకి ఆ విమానం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు కానీ.. కరెంటు తీగలు తెగిపోవడంతో, కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా.. కౌంటీవాసులంతా పవర్ లేకుండానే రాత్రంతా గడపాల్సి వచ్చింది. 10 అంతస్తుల ఎత్తులోనే విమానం కుప్పకూలింది కాబట్టి, ఈ ప్రమాదం ఎల సంభవించిందో ఇప్పుడే కచ్ఛితంగా చెప్పలేమని అధికారులు తెలిపారు. వర్షాలు పడుతున్నాయి కాబట్టి, వాతావరణ పరిస్థితులు ఏమంత బాగోలేదని.. ఈ ప్రమాదం జరగడానికి అదే కారణం అయ్యుండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ సాగుతోందని పేర్కొన్నారు.
మరోవైపు.. ఆ ప్లేన్‌లో ఉన్న ఒక పైలట్, ప్యాసింజర్ని రెస్క్యూ బృందం కాపాడింది. 100 అడుగుల ఎత్తులో ఒక పవర్ పోల్‌లో ప్లేన్ ఇరుక్కుపోవడంతో.. ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టమైంది. దాదాపు ఏడు గంటలపాటు కష్టపడి, ఆ ఇద్దరిని కాపాడగలిగారు. పైలట్ పాట్రిక్ మర్కల్ (65) వాషింగ్టన్ డీసీకి చెందినవాడు కాగా.. ప్యాసింజర్ జాన్ విలియమ్సన్ (66) లూసియానాకు చెందినవాడుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో వారికి గాయాలు కావడంతో.. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందుకున్న ఆ ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. సెల్‌ఫోన్ ద్వారా విమానంలో ఉన్న ఆ ఇద్దరిని కాంటాక్ట్ చేసి, ఎప్పటికప్పుడు వారిని పరిశీలిస్తూ వచ్చామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు.. ఇక ఈ ప్రమాదంపై మాంట్గోమెరీ పోలీసులు ట్వీట్ చేస్తూ.. విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన కారణంగా, ఆ ప్రాంతంలో కరెంటు తీగలు నేలపై పడి ఉన్నాయని, కావున ఆ ప్రాంతంవైపు వెళ్లొద్దని సూచించారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!