Site icon NTV Telugu

కుప్పకూలిన మరో విమానం.. 9 మంది మృతి

తమిళనాడు తాజాగా జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మొత్తం 14 మంది మృతిచెందిన ఘటన అందరినీ కలచివేసింది.. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక చోట వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇవాళ మరో విమానం కుప్పకూలింది.. 9 మంది ప్రాణాలను తీసింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో ఓ విమానం ప్రమాదానికి గురైంది.. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ విమానం.. డొమినికన్‌లోని లా ఇసబెల్లా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది… టెకాఫ్‌ అయిన కేవలం 15 నిమిషాలకే శాంటో డొమింగోలోని లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరం ల్యాండ్‌ చేశాడు పైలట్.. ఇదే సమయంలో విమానం పేలిపోయింది.. విమానంలో ఉన్న అందరూ మృతిచెందారు.. వారిలో లాటిన్ సంగీత కళాకారుడు, భాగస్వామి, కుమారుడు హెలిడోసా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో విచారాన్ని వ్యక్తం చేసిన విమానయాన సంస్థ.. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించింది..

Exit mobile version