NTV Telugu Site icon

Tomato Price: ఆకాశాన్నంటిన టమోటా ధర.. పిజ్జాపై భారీ ఎఫెక్ట్

Uk Tomato Price

Uk Tomato Price

Pizza Pasta Go tomato-free In UK As Veggie Prices Shoot Up: టమోటా.. దీనిని దాదాపు ప్రతీ వంటకంలోనూ వాడుతారు. ఈ టమోటా వేసిన వంటకాల రుచి వేరుగా, టేస్టీగా ఉంటుంది. ఇక పిజ్జా అయితే.. టమోటా లేనిదే రుచికరంగా ఉండదు. కానీ, బ్రిటన్ ప్రజలు ఇప్పుడు టమోటా లేకుండానే పిజ్జా తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. అక్కడ టమోటా ధరలకు రెక్కలొచ్చేశాయి. గతేడాది కేవలం 5 పౌండ్లు ఉన్న కిలో టమోటా ధర.. ఇప్పుడు 20 పౌండ్లకు (ఇండియన్ కరెన్సీలో రూ.1986)కి చేరింది. కొన్ని చోట్ల 30 పౌండ్ల (రూ.2979)కు అమ్ముతున్నారు. ఇలా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, సూపర్ మార్కెట్లలో టమోటా కొరత ఏర్పడింది. ముఖ్యంగా.. పిజ్జా మార్కెట్‌పై భారీ ఎఫెక్ట్ పడింది.

Rishabh Pant: జీవితం విలువ తెలిసింది.. రెట్టింపు ఉత్సాహంతో తిరిగొస్తా

పిజ్జా, పాస్తా, సాస్ తయారీలో టమోటాను వినియోగిస్తారన్న విషయం తెలిసిందే! ఇప్పుడు టమోటా ధరలు గణనీయంగా పెరగడంతో.. వ్యాపారులు పిజ్జా ధరల్ని అమాంతం పెంచేశారు. కొందరు.. టమోటా-ఫ్రీ (టమోటా లేని) పిజ్జాలను విక్రయిస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లైతే తాత్కాలికంగా మూతపడ్డాయి కూడా! ఒక్క బ్రిటన్‌లోనే కాదు.. ఇటలీలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ టమోటా ధరలు పెరగడంపై ఇటాలియన్ చెఫ్స్ అసోసియేషన్ FIC అధ్యక్షుడు ఎంజో ఒలివేరి మాట్లాడుతూ.. ప్రతీ చోటా టమోటాల షార్టేజ్ ఉందని, ఎక్కడి నుంచి టమోటాలు సరఫరా అవ్వడం లేదని అన్నారు. కొన్ని రెస్టారెంట్లైతే టమోటా-లెస్ పిజ్జాలను అందిస్తుండటంతో పాటు కొన్ని వంటకాల్ని పూర్తిగా ‘మెను’ నుంచి తీసేశాయని తెలిపారు. టమోటా ధరలు భారీగా పెరగడం వల్ల.. వైట్ పిజ్జాల, వైట్ సాస్, టమోటా-లెస్ పిజ్జాల ట్రెండ్‌ని మొదలుపెట్టాల్సి వచ్చిందన్నారు.

Gas Prices Hike: మళ్లీ పెరిగిన వంట గ్యాస్‌ ధర.. వాణిజ్య సిలిండర్‌ ధర రూ.350.50 వడ్డింపు..

అసలు టమోటా ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి?
బ్రిటన్‌కు స్పెయిన్, నార్త్ అమెరికాల నుంచి శీతాకాలపు నెలల్లో దాదాపు 95% టమోటాలు సరఫరా అవుతుంటాయి. అయితే.. ఇప్పుడు ఆ రెండు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు. స్పెయిన్‌లో పరిమితికి మించి చలి ఉండగా, మొరాకోలో వరదల కారణంగా పంట దిగుబడులు దెబ్బతిన్నాయి. దీంతో ఆయా దేశాలు ఎగుమతుల్ని నిలిపివేశాయి. అటు.. అధిక విద్యుత్ టారిఫ్‌లు బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని గ్రీన్‌హౌస్‌లలో పండించే ఉత్పత్తుల సరఫరాపై కూడా ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, లాజిస్టిక్ సమస్యలు, బ్రెక్సిట్ వంటి అంశాల కారణంగా.. ఇటాలియన్ రెస్టారెంట్‌లకు కష్టకాలం ఎదురైంది.