NTV Telugu Site icon

Nepal Plane Crash: 18 మంది చనిపోయినా, పైలెట్ మాత్రం అద్భుతంగా బయటపడ్డాడు.. ఎలా సాధ్యమైంది..

Nepal Flight Crash

Nepal Flight Crash

Nepal Flight crash: నేపాల్‌లో నిన్న జరిగిన భయంకర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. అయితే, అనూహ్యంగా ఈ ప్రమాదంలో ఒక్క పైలెట్ మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కెప్టెన్ మనీష్ రాజ్ షాక్యా ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా మిగిలాడు. అంతటి ఘోర విమాన ప్రమాదంలో పైలెట్ ప్రాణాలతో ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read Also: Tata Curvv EV: అదిరిపోయిన టాటా కర్వ్ EV ఇంటీరియర్, ఫీచర్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?

సౌర్య ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోంబార్డియన్ CRJ-200 విమానం, 19 మంది సిబ్బందితో సహా, ఇద్దరు సిబ్బంది, ఎయిర్‌లైన్‌లోని సాంకేతిక సిబ్బందితో బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. మృతుల్లో 15 మంది అక్కడిక్కడే మరణించగా, ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో పైలెట్ ఉన్న కాక్‌పిట్ భాగం ఓ కంటైనర్‌ని ఢీ కొట్టింది. కాక్ పిట్ కంటైన్‌లో చిక్కుకుని, మిగతా విమానభాగాలు వేరై నేలపై పడి మంటలు అంటుకున్నాయి. 37 ఏళ్ల షాక్యాని కంటైనర్ లోపల గుర్తించారు. ఇదే అతడి ప్రాణాలను కాపాడింది.

ప్రస్తుతం శక్యా ఖాట్మాండు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. అతడి మెదడులో గాయాలైనట్లు వైద్యులు చెప్పారు. వెన్నుముక రెండు ప్రాంతాల్లో విరిగినట్లు వైద్యులు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి బుధవారంతో పోలిస్తే గురువారం మెరుగైనట్లు వెల్లడించారు. శాక్యా మంటల్లో కాలిపోనప్పటికీ, పలు ప్రాంతాల్లో ఎముకలు విరిగినట్లు వెల్లడించారు.