Site icon NTV Telugu

Viral video: రైలు కింద పడుకున్నా ఏం కాలేదంటే… నువ్వు నిజంగా దేవుడివి స్వామి..

Untitled Design

Untitled Design

పెరు దేశంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి పట్టాలపై తల పెట్టి పడుకున్నాడు. రైలు అతడి మీద నుంచి వెళ్లింది. ఈ క్ర‌మంలో కొంద‌రు ఘోర ప్ర‌మాదాల్లో చిక్కుకుంటారు. అయితే అలా ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న ఓ వ్య‌క్తి మాత్రం బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పెరు దేశంలో ఓ వ్యక్తి ఫుల్లుగా తాగిన ఓ వ్య‌క్తి రైల్వే ట్రాకుపై త‌ల‌పెట్టి పడుకున్నాడు. అత‌డు ప‌డుకున్న స‌మ‌యంలోనే రైలు రావ‌డంతో వ్య‌క్తిపై నుండి వెళ్లింది. అయితే చ‌క్రాల కింద‌నే కొంత దూరం వ‌ర‌కు రైలు అత‌డిని తోచుకునివెళ్లినా చిన్న గీత కూడా త‌గ‌ల్లేదు.

మిక్స‌ర్ లో ప‌డి త‌ప్పించుకున్న ఆహార ధాన్యాల మాదిరిగా తృటిలో త‌ప్పించుకుని బ‌ట‌య‌ప‌డ్డాడు. రైలు వెళ్లినంత‌సేపు ఏం జ‌రుగుతుందో తెలియ‌క‌పోయినా.. అది వెళ్లిన త‌ర‌వాత మాత్రం లేచి కూర్చుకున్నాడు. ప‌క్క‌నే ఉన్న మ‌రో వ్య‌క్తి వ‌చ్చి అత‌న్ని ప‌ట్టుకుని ఆశ్చ‌ర్య‌పోయాడు. ప్ర‌స్తుం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ఏ బ్రాండ్ తాగి పడుకున్నావురా అని కామెంట్ చేయగా మరో నెటిజన్, అదృష్టం అంటే వీడిదే… అంటూ కామెంట్ పెట్టాడు. ఏదేమైనా రైలు ప్ర‌మాదానికి గురై కూడా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు అంటే ఏ జ‌న్మ‌లో చేసుకున్న పుణ్య‌మో అనే చెప్పాలి.

Exit mobile version