Flight Crash: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలింది. 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానం పోఖారాలోని అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వేపై కుప్పకూలింది. దేశ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన విమానం పోఖారాలో ల్యాండ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం సమయంలో ఫ్లైట్ లో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారని యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ప్రకటించారు. కూలిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుంది.
Read Also:Ramgopal Varma: ఫ్రెండ్ పిలిస్తే వచ్చా.. నాగబాబు కామెంట్లపై స్పందించను
ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఎయిర్ పోర్టును మూసేశారు. ప్రమాదంలో చాలా మంది వరకు చనిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై ఇంకా ఎలాంటి వివరాలు ప్రకటించలేదు నేపాల్ ప్రభుత్వం. ఫ్లైట్ లో పది మంది భారతీయులు ఉన్నట్ల సమాచారం. ప్రస్తుతం 16 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.