Site icon NTV Telugu

Pakistani Doctor: నర్సుతో సె*క్స్‌ కోసం, రోగిని ఆపరేషన్ మధ్యలో వదిలేసిన డాక్టర్..

Pakistani Doctor

Pakistani Doctor

Pakistani Doctor: రోగికి ఆపరేషన్ సమయంలో వైద్యులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎంత ఎమర్జెన్సీ అయినా, శస్త్రచికిత్స పూర్తయిన తర్వాతే, మిగతా పనులు చూసుకుంటారు. కానీ బ్రిటన్‌లో పాకిస్తానీ వైద్యుడు మాత్రం సె*క్స్ కోసం ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లాడు. 44 ఏళ్ల కన్సల్టెంట్ అనస్థీషియా నిపుణుడు డాక్టర్ సుహైల్ అంజుమ్, గాల్ బ్లాడర్ సర్జరీ సమయంలో ఒక రోగిని అనస్థీషియా ఇచ్చి వదిలి వెళ్లాడు. ఈ ఘటన యూకేలోని గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్ సైడ్ హాస్పిటల్‌లో జరిగింది.

హాస్పిటల్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో ఒక నర్సుతో సెక్స్ చేయడానికి డాక్టర్ వెళ్లినట్లు యూఎస్ మెడికల్ ట్రిబ్యునల్ చెప్పింది. ఈ సంఘటనను వేరే నర్స్ ప్రత్యక్షంగా చూశారు. డాక్టర్ అంజమ్‌ను నర్స్ సీ అని పిలుబడే నర్సుతో అసభ్యకరమైన స్థితిలో చూసినట్లు వేరే నర్స్ చెప్పింది. డాక్టర్ నర్సుతో శృంగారంలో పాల్గొన్న 8 నిమిషాల తర్వాత సర్జరీ పూర్తి చేయడానికి తిరిగి వచ్చాడు. తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. రోగిని ప్రమాదంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, రోగికి ఎలాంటి హాని జరగలేదు. ఇదే కాకుండా, తన పరిస్థితికి తన కుమార్తె అకాల మరణం, వైవాహిక ఒత్తిడి కూడా కారణమని పేర్కొన్నాడు.

Read Also: Ring of Fire: ఎందుకు ఈ వరస భూకంపాలు.. ‘‘రింగ్ ఆఫ్ ఫైర్’’లో ఏం జరుగుతోంది..?

ది ఇండిపెండెంట్ నివేదించిన ప్రకారం, డాక్టర్ సుహైల్ అంజుమ్ ఫిబ్రవరి 2024లో టేమ్‌సైడ్ హాస్పిటల్‌ను విడిచిపెట్టి, తన స్వదేశమైన పాకిస్తాన్‌కు తిరిగి వచ్చానని మెడికల్ ప్రాక్టీషనర్స్ ట్రిబ్యునల్ సర్వీస్ (MPTS)కి తెలియజేశారు. అయితే, తాను మళ్లీ యూకేలో తన వైద్య వృత్తిని తిరిగి ప్రారంభించాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఒకసారి తప్పు చేశానని, మరోసారి ఇలాంటి తప్పు జరగదని ప్యానెల్‌కు హామీ ఇచ్చారు. ‘‘ ఇది చాలా సిగ్గుచేటు. నేను నన్ను మాత్రమే నిందించుకోవాలి. నేను నా రోగితో పాటు ప్రతీ ఒక్కరినీ నిరాశపరిచాను. నాకు గౌరవం ఇచ్చిన నా సహోద్యోగులను నేను నిరాశపరిచాను’’ అని ప్యానెల్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. నా వల్ల నర్సు కూడా ఇబ్బందికరపరిస్థితి ఎదుర్కొందని చెప్పాడు.

Exit mobile version