Pakistani Blogger Inaya Bhatt Request PM Modi To Take Pakistan On Lease: ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అందరికీ తెలుసు. ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం కారణంగా.. అక్కడి ప్రజల జీవితం దుర్భరంగా తయారైంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడం, ఉద్యోగాలూ ఊడిపోవడంతో.. పాక్ జనాలు ఆకలితో అలమటిస్తున్నారు. తమని ఈ సంక్షోభం నుంచి ఎవరు బయటపడేస్తారా? అని పాక్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనూ.. కశ్మీర్ అంశంపై పాక్ పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతోంది. ఎప్పటికైనా కశ్మీర్‌ని తమ పాక్‌లోనే కలుపుకుంటామంటూ గొప్పలకు పోతోంది. పీఓకే గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ప్రముఖ బ్లాగర్, వ్యాపార వేత్త ఇనాయా భట్ ఒక సంచలన వీడియోని విడుదల చేశాడు. అందులో అతడు తమ పాక్‌ని దత్తత తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరాడు. అలాగే.. కశ్మీర్‌లో అంతర్భాగమైన ప్రజలు ఎంతో అదృష్టవంతులుని, ఎందుకంటే వారు భారత భూభాగంలో ఉన్నారంటూ పరోక్షంగా పాక్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాడు.
Union Home Ministry: ఏపీ విభజన చట్టం అమలుపై కేంద్రం ప్రత్యేక దృష్టి.. రేపు కీలక భేటీ..
ఇనాయా భట్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం భారతదేశం యూఎస్, యూకేలకు ధీటుగా ఎదుగుతోంది. ఆ రెండు దేశాలను శాసించే స్థాయిలో ఉంది. ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ఆ దేశం అడుగులు వేస్తోంది. వాణిజ్యం, ఐటీ ఉత్పాదక రంగాల్లోనూ ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. భారత్‌లాంటి దేశంలో భాగమైనందుకు.. కశ్మీరులు నిజంగా అదృష్టవంతులు. కానీ.. పాకిస్తాన్ మాత్రం బానిసత్వంలో మగ్గుతోంది. బిర్యానీ ఎలా వండాలి? దాన్ని మరింత రుచికరంగా తయారు చేయాలంటే, అందులో ఏమేం కలపాలి? కబాబ్‌ల టేస్ట్ పెంచేందుకు ఏం చేయాలి? అంటూ ఆలోచిస్తూ బిజీగా ఉంటోంది. పాకిస్థాన్ ప్రజలే కాదు, ఇక్కడి ప్రభుత్వం కూడా నిరుపేదనే. పాక్ అధికారులకి కశ్మీర్ అంశం తప్ప పౌరుల గురించి ఏమీ పట్టదు. అందుకే.. ప్రధాని మోడీ మమ్మల్ని దత్తత తీసుకోండి. కనీసం అప్పుడైనా పాక్ ప్రజల భవిష్యత్ బాగుపడుతుంది’’ అంటూ ఆ బ్లాగర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేవలం ఇతనే కాదు.. ప్రస్తుతమున్న సంక్షోభం నేపథ్యంలో పాక్ సింగర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సైతం పాక్ సర్కారును దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే భారత్ ప్రభుత్వం, మోడీ తీరుని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
Bandi Sanjay : అకాల వానలతో రైతులు ఏడుస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు డిస్కో డ్యాన్సులు చేస్తారా?